Budget 2024 LIVE:మోడీ 3.0 బడ్జెట్ ఎలా ఉంటుంది? ఎవరెన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు?

Union Budget 2024 Live updates: నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారు. ఎవరు ఎలాంటి ఆశలు పెట్టుకొని ఉన్నారు... ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోండి

Sheershika Last Updated: 22 Jul 2024 11:56 AM
మళ్లీ నీట్‌ పేపర్ లీక్‌పై రగడ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభలో అలజడి మొదలైంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ పేపర్ లీక్‌ వ్యవహారాన్ని ప్రస్తావించడం వల్ల గందరగోళం నెలకొంది. 

ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డుౌ

ఈ నెల 23నఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆమె బడ్జెట్ సమావేశాలకు ముందు చేసే హల్వా వేడుకను నిర్వహించారు. కాగా, భారత బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సీతారామన్ అత్యంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని అందించిన రికార్డును కలిగి ఉన్నారు.

Background

మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. జులై 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆమె బడ్జెట్‌ సమావేశాలకు ముందు చేసే హల్వా వేడుకను ఈ మధ్య చేపట్టారు. 


2024 ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి బడ్జెట్ తీసుకురానుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. గత పదేళ్లుగా సంస్కరణలకే ప్రాధాన్యత ఇచ్చిన నిర్మలమ్మ ఈసారి ఎలాంటి ప్రయోగం చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈసారి జనరంజకంగా ఉంటుందా లేకుంటే ఎప్పటి మాదిరిగానే తన మార్క్‌ చూపించి సంస్కరణలకే ప్రాధాన్యత ఇస్తారా అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్‌. 


మోదీ మెజార్టీ తగ్గడంతో అన్ని రాష్ట్రాల నుంచి స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బడ్జెట్ ముందు ఎలాంటి డిమాండ్లు చేయని వారందా తమ రాష్ట్రాలకు కావాల్సిన నిధుల కోసం పట్టుబడుతున్నారు. అలాంటి రాష్ట్రాల్లో ముందున్నవి బిహార్, ఆంధ్రప్రదేశ్‌. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలపై ఆధారపడే కేంద్రంలో మోదీ సర్కారు పాలిస్తోందనే విషయం తెలిసిందే. అందుకే తమ డిమాండ్ల సాధించుకోవడానికి ఇరు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ఏపీ ఆర్థిక పరిస్థితిని ఏకరవు పెట్టారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా అప్పుల కుప్పగా మార్చేసిందని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా కేంద్రం సాయం కావాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పోలవరం, అమరావతిపై కరుణ చూపాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. అప్పుల పరిమితి కూడా పెంచాలని ఉన్న అప్పులపై కొన్ని వెసులుబాటులు కల్పించాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. 


మరోవైపు బిహార్ నుంచి నితీష్ కుమార్ కూడా భారీ డిమాండ్‌లు కేంద్రం ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ఆయన పదే పదే డిమాండ్ చేస్తున్నారు. 


ఇలా వీళ్లతోపాటు మిగతా రాష్ట్రాల నుంచి భారీగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ టైంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. పదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తించి నిధులు ఇచ్చింది లేదు. కేంద్ర పథకాల్లో భాగంగా నిధులు ఇవ్వడమే తప్ప ప్రత్యేక నేరుగా రాష్ట్రాలకు ఇచ్చిందేమీ లేదు. మరి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఏం చేస్తారనే ఉత్కంఠ ఉండనే ఉంది. 


ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉద్యోగులు, సామాన్య ప్రజలు, వ్యాపార దిగ్గజాలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతే కాకుండా ఈ ఏడాదిలోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బడ్జెట్‌పై ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. 


సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందులో స్థూలంగా తమ ఆలోచన సరళిని ప్రభుత్వ స్పష్టం చేయనుంది. తర్వాత రోజు అంటే జులై 23న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.