ABP  WhatsApp

Vande Bharat Trains: 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు: నిర్మలా సీతారామన్

ABP Desam Updated at: 01 Feb 2022 03:19 PM (IST)
Edited By: Murali Krishna

వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు

NEXT PREV

కేంద్ర బడ్జెట్-2022ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్​ రైళ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అధునాతన సౌకర్యాలు మరింత సామర్థ్యంతో ఈ రైళ్లు ఉంటాయన్నారు.








స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ఈ బడ్జెట్‌లో రాబోయే 25 ఏళ్లకు సంబంధించిన బ్లూప్రింట్ రెడీ చేశాం. రైల్వే శాఖకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాం. మూడేళ్లలో 400 కొత్తతరం వందేభారత్ రైళ్లను నడపనున్నాం. రాబోయే మూడేళ్లలో 100PM గతి శక్తి కార్గో టెర్మినల్స్(100 PM Gati Shakti Cargo terminals) అభివృద్ధి చేస్తాం. మెట్రో వ్యవస్థను నిర్మించడానికి కొత్త పద్ధతులు అనుసరిస్తాం. -                                                 నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి







రానున్న మూడేళ్లలో పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దీంతోపాటు మెట్రో వ్యవస్థల నిర్మాణానికి వినూత్న విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.


ప్రజలు, వస్తువుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 2022-23లో ఎక్స్‌ప్రెస్‌వేల కోసం పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని నిర్మల చెప్పారు. 2022-23 లో జాతీయ రహదారుల నెట్​వర్క్​ 25,000 కి.మీ విస్తరించనుందని పేర్కొన్నారు. ప్రజా వనరుల కోసం రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.


Also Read: Budget 2022, Digital Rupee: బ్లాక్‌చైన్‌తో డిజిటల్‌ రూపాయి! క్రిప్టో కరెన్సీకి చుక్కలేనా?


Also Read: Tax Slab, Budget 2022: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!

Published at: 01 Feb 2022 12:17 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.