వేతన జీవులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాశపరిచారు! ఈ ఏడాదీ ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయలేదు. ఎప్పట్లాగే ఉంచారు. కొన్ని మినహాయింపులు కల్పించారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను ప్రభుత్వం 2014లో సవరించింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.
* పన్ను చెల్లింపుదారులకు ఒక ఊరట కల్పించారు! ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా మార్చుకొనేందుకు రెండేళ్ల సమయం ఇచ్చారు. అంటే అసెస్‌మెంట్ ఇయర్ నుంచి రెండేళ్ల వరకు అన్నమాట.
Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు
Also Read: Union Budget 2022 : రాష్ట్రాలకు "నిర్మల"మైన కానుక.. వడ్డీ లేని రూ. లక్ష కోట్ల రుణాలు !
* నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో జమ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల మధ్య ఉన్న బేధాన్ని తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని 14శాతానికి పెంచారు.
* వర్చువల్ లేదా డిజిటల్ అసెట్ బదలాయింపుపై 30 శాతం పన్ను వేశారు. వర్చువల్ అసెట్లను బహుమతులుగా ఇస్తే తీసుకున్న వారు పన్ను కట్టాల్సి ఉంటుంది.
* సర్‌ఛార్జ్ హేతుబద్ధీకరణకు పెద్దపీట వేశారు. ఏఓపీలు, లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై సర్‌ఛార్జ్‌ను 15 శాతానికి పరిమితం చేశారు.
* బయటపెట్టని ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎలాంటి చట్టాలనుంచి కూడా మినహాయింపు లేకుండా చర్యలు ఉంటాయి.
* దివ్యాంగుల తల్లిదండ్రులు, సంరక్షకుడు తీసుకొనే బీమా, బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు ఇచ్చారు.