Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుడటంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను వేగవంతం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు విమానాలు ఢిల్లీకి చేరుకోగా, శనివారం ఉదయం రొమేనియా నుంచి ఢిల్లికి వచ్చింది. సుసివా నుంచి 229 మంది భారత పౌరులను ఆపరేషన్ గంగ (Operation Ganga) ప్రాజెక్టులో భాగంగా ఇండిగో విమానంలో క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు.
ఏర్పాట్లు చూస్తున్న మంత్రి హర్దీప్ సింగ్ పూరి
తమకు ఎంతో సహాయం చేసిన కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ అధికారులకు విద్యార్థులు, పౌరులు ధన్యవాదాలు తెలిపారు. ఇన్ని రోజులపాటు నీళ్లు, ఆహారం అందించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారని చెప్పారు. బుడాపెస్ట్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 3000 మందిని తరలించారు. మరో 1100 మందిని నిన్న రాత్రి ప్రత్యేక విమానాలలో భారత్‌కు తరలిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. హంగరీ జహోని సరిహద్దుల వద్ద భారత పౌరులను సురక్షితంగా తరలిస్తూ రొమేనియాలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 5,245 మందిని ఢిల్లీకి తీసుకొచ్చినట్లు సమాచారం.
ఉక్రెయిన్ నుంచి తరలింపు వేగవంతం..
ఉక్రెనియా నుంచి పౌరులను భారత్‌కు తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా దేశ పౌరులను స్వస్థలాలకు తీసుకురావాలని విదేశాంగశాఖకు, ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు స్లోవేకియా, పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా రొమేనియా, మరో కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ పోలాండ్, హర్దీప్ సింగ్ పూరి హంగరీ నుంచి పౌరులను భారత్‌కు తరలించే చర్యలను చూసుకుంటున్నారు.
ఉక్రెయిన్‌లో ఉన్న పౌరులను ఎప్పటికప్పుడూ ఆహారం, నీళ్లు లాంటి కనీస సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఎప్పటికప్పుడూ ప్రత్యేక విమానాలు ఉక్రెయిన్, పొరుగు దేశాలకు చేరుకుని అక్కడ చిక్కుకున్న వారిని సహాయసహకారాలు అందిస్తోంది. ఆపరేషన్ గంగలో భాగంగా శుక్రవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ17 విమానాలతో పాటు ఒక్కరోజే 16 విమనాలలో పౌరులను భారత్‌కు తరలించారు. రష్యా మాత్రం తన నిర్ణయాలలో తగ్గడం లేదు. ఉక్రెయిన్ లోని ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది. కొన్ని కీలక నగరాలలో బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో మోతెక్కిస్తోంది.
Also Read: Russia-Ukraine War: ఒకే దారిలో భారత్, చైనా, పాక్- మూడోసారి కూడా ఓటింగ్‌కు దూరం
Also Read: CAATSA India: భారత్ మెడపై 'కాట్సా' కత్తి- బైడెన్ కోర్టులో బంతి, మోదీ ఏం చేస్తారో మరి!