రష్యా వ్యతిరేక ఓటింగ్‌కు మరోసారి భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దాడిపై అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఐరాస మానవహక్కుల మండలిలో తీర్మానం పెట్టారు.
ఇందుకు 32 దేశాలు అనుకూలత వ్యక్తం చేయగా, 2 దేశాలు వ్యతిరేకంగా ఓట్లేశాయి. భారత్, చైనా, పాకిస్థాన్ సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
✅ YES: 32
❌ NO: 2
➖ ఓటింగ్‌కు దూరం: 13
మూడోసారి
ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఇటీవల జరిగిన ఓటింగ్‌కు కూడా భారత్ దూరమైంది. ఈ ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా 141 దేశాలు ఓటేశాయి. 5 దేశాలు ఓటింగ్‌ను వ్యతిరేకించాయి. భారత్, చైనా, పాక్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అంతకుముందు కూడా ఓసారి భారత్ ఓటింగ్‌కు దూరమైంది.
ఇప్పటికీ అదే బాట
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ ముందు నుంచి శాంతిమంత్రమే జపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది.
రష్యాతో బలమైన మైత్రి ఉన్నందునే ఓటు వేసేందుకు భారత్ దూరంగా ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కారణంగానే ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కూ భారత్ దూరంగానే ఉంది.
Also Read: CAATSA India: భారత్ మెడపై 'కాట్సా' కత్తి- బైడెన్ కోర్టులో బంతి, మోదీ ఏం చేస్తారో మరి!
Also Read: Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ