ABP  WhatsApp

Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ

ABP Desam Updated at: 04 Mar 2022 02:59 PM (IST)
Edited By: Murali Krishna

Russia Ukraine War: రష్యా దాడిలో అణువిద్యుత్ కేంద్రం పేలితే అది ఐరోపా అంతానికి దారితీస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు.

ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ

NEXT PREV

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధం గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రష్యా.. అణు విద్యుత్ కేంద్రాలపై దాడి చేయడం చాలా ప్రమాదకరమన్నారు. ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారంపై రష్యా దాడి చేయడాన్నికి ఆయన ఖండించారు. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.


ఇది ఐరోపా అంతమే







చెర్నోబిల్‌ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే. ఇది గనుక పేలితే ఐరోపా అంతం అవుతుంది. చెర్నోబిల్‌ కంటే ఇది 10 రెట్లు ప్రభావం చూపిస్తుంది. ఈ అణు కర్మాగారాన్ని ఇంత వరకు మేం సురక్షితంగా ఉంచాం. కానీ రష్యా దాడి కారణంగా ఇది పేలితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన దాడి మాత్రం కాదు.  పదివేల మంది ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయవలసి వచ్చింది. ఐరోపా దేశ నాయకులారా మేల్కొండి. జపోరిజ్జియా 15 బ్లాక్‌లు కలిగిన అతి పెద్ద ప్లాంట్‌. ఒక వేళ పేలుడు జరిగితే ఇది ఐరోపా వాసులందరకీ ముగింపే అనే విషయాన్ని గుర్తించండి.                                                                - వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు


ఇప్పుడు ఓకే


ఈ అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో మంటలు చెలరేగటం వల్ల ఆందోళన నెలకొంది. అయితే, జాతీయ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు చెప్పారు.


ప్రపంచనేతల ఆందోళన


ఈ దాడిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యా సేనలు ఎదుర్కోవాలని, తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాన్ని జాగ్రత్తగా రక్షించాలన్నారు.



Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయం- కీవ్‌ నుంచి తప్పించుకునే సమయంలో


Also Read: Ukraine Russia War: అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడులు - వీడియో వైరల్ 


Published at: 04 Mar 2022 02:57 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.