ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే రష్యా- ఉక్రెయిన్ సైనికుల కాల్పుల్లో గురువారం మరో భారత విద్యార్థికి తుపాకీ తూటా తగిలినట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. కీవ్ నగరం నుంచి తప్పించుకునేందుకు విద్యార్థి ప్రయత్నిస్తోన్న సమయంలో బుల్లెట్ తగిలినట్లు తెలిపారు.
ఈ మేరకు పోలాండ్ విమానాశ్రయంలో ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి వీకే సింగ్ వెల్లడించారు.
భారత విద్యార్థి మృతి
ఖార్కివ్‌లో రష్యా సైనికులు మంగళవారం చేసిన షెల్లింగ్‌లో నవీన్ అనే భారత విద్యార్థి మృతి చెందాడు. ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వచ్చిన సమయంలో నవీన్ బలైపోయాడు. కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల నవీన్.. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదవుతున్నాడు.
ఆపరషేన్ గంగా
నవీన్ మృతి తర్వాత ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల తరలింపును కేంద్ర వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగా పేరుతో ఈ తరలింపు కార్యక్రమం చేపడుతోంది.
అయితే ఉక్రెయిన్ నుంచి ఇంకా 1700 మంది వరకు భారత విద్యార్థులు స్వదేశానికి రావడానికి వేచిచూస్తున్నారని కేంద్రమంత్రి వీకే సింగ్ అన్నారు.
భారత విద్యార్థుల తరలింపును వేగవంతం చేసేందుకు నలుగురు కేంద్రమంత్రులను మోదీ సర్కార్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపింది. ఇందులో జనరల్ వీకే సింగ్ ఒకరు. ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
Also Read: Ukraine Russia War: అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడులు - వీడియో వైరల్