తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రథోత్సవం నిర్వహిస్తుండగా జరిగిన భారీ అగ్ని ప్రమాదం (Thanjavur Fire Accident)లో 11 మంది సజీవదహనం అయ్యారు. మరికొంత మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో చిన్నారు కూడా ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయ రథోత్సవం నిర్వహిస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సజీవ దహనం అయ్యారని స్థానిక పోలీసులు జాతీయ మీడియా ఏఎన్ఐకి తెలిపారు. బుధవారం వేకువజామున ఈ విషాదం జరిగింది.


వేకువజామున తీవ్ర విషాదం.. 
తంజావూరులోని కలిమేడు అప్పర్‌ ఆలయంలో గురుపూజై సందర్భంగా స్వామివారికి ఆలయ నిర్వాకులు రథోత్సవం (Temple chariot procession) నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి ఉత్సవం ప్రారంభం కాగా, బుధవారం వేకువజామున భక్తులు రథాన్ని లాగుతుండగా ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రథం వద్ద ఉన్న భక్తులు కొందరు సజీవదహనం అయ్యారు. మరో 15 మంది వరకు కాలిన గాయాలతో తంజావూరు ఆసుపత్రిలో చేరారు.






ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
రథోత్సవంలో అపశ్రుతిపై తిరుచిరాపల్లి సెంట్రల్ జోన్ ఐజీ వి బాలక్రిష్ణన్ స్పందించారు. రథాన్ని లాగుతున్న భక్తులు , నిర్వాహకులు విద్యుత్ తీగలను గమనించలేదు. రథం పెద్దదిగా ఉండటంతో రథం హై టెన్షన్ తీగలను తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించి విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. రథోత్సవంలో అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం కాగా, కాలిన గాయాలైన కొందరు భక్తులను చికిత్స నిమిత్తం తంజావూరు మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు.


Also Read: Madanapalle Crime : ఈజీ మనీ కోసం యువకుడి స్కెచ్, ప్లాన్ రివర్స్ అయి పోలీసులకు చిక్కాడు


Also Read: Women Death Mystery : చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్