Thanjavur Chariot Incident: తమిళనాడులోని తంజూవూరులో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథోత్సవంలో షార్ట్ సర్క్యూట్ జరిగి 11 మంది భక్తులు సజీవదహనం కావడంతో విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం (PM Modi Expresses Grief, Announces Rs 2 Lakh Ex Gratia) ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి అందజేస్తామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రథోత్సవం నిర్వహిస్తుండగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు. మరికొంత మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయ రథోత్సవం నిర్వహిస్తుండగా హై టెన్షన్ విద్యుత్ తీగలకు రథం తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి భక్తులు సజీవ దహనం అయ్యారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
రథోత్సవంలో అపశ్రుతిపై తిరుచిరాపల్లి సెంట్రల్ జోన్ ఐజీ వి బాలక్రిష్ణన్ స్పందించారు. రథాన్ని లాగుతున్న భక్తులు , నిర్వాహకులు విద్యుత్ తీగలను గమనించలేదు. రథం పెద్దదిగా ఉండటంతో రథం హై టెన్షన్ తీగలను తగలడంతో అగ్ని ప్రమాదం సంభవించి విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read: Women Death Mystery : చనిపోయిందని ఏడ్చారు కానీ మమ్మీ రిటర్న్స్ ! ఈవిడ కథలో స్టన్నింగ్ సీక్రెట్స్