Tesla in India:
ఏటా 5 లక్షల కార్‌ల తయారీ..!
అన్నీ అనుకున్నట్టుగా జరిగితే...త్వరలోనే ఇండియన్స్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లు (Tesla Electric Cars) కొనుగోలు చేసుకునే ఛాన్స్ వచ్చేస్తుంది. అది కూడా మన ఇండియాలోనే తయారవుతాయి. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే టెస్లా చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఇండియాలో తయారయ్యే టెస్లా ఎలక్ట్రిక్ కార్‌ల ధర రూ.20 లక్షల వరకూ ఉంటుందని అంచనా. సంవత్సరానికి కనీసం 5 లక్షల కార్లు తయారు చేసేలా భారీ ప్లాన్‌తో రెడీ అవుతోంది టెస్లా కంపెనీ. మరో హైలైట్ ఏంటంటే..కేవలం ఇండియాలో విక్రయించేందుకే కాదు. మొత్తం ఇండో పసిఫిక్ రీజియన్‌కి ఇక్కడి నుంచి కార్‌లను సప్లై చేయాలని చూస్తోంది టెస్లా. అంటే...ఈ మొత్తానికి ఇండియా హబ్‌గా ఉండనుంది. అయితే..దీనిపై ఇప్పటి వరకూ టెస్లా నుంచి కానీ కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కేంద్రం, టెస్లా మధ్య చిన్న విభేదాలు తలెత్తాయి. ఇండియాకు కార్‌లు ఇంపోర్ట్ చేయడం కష్టమవుతోందని టెస్లా అసహనం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా గట్టిగానే స్పందించింది. దిగుమతి పన్ను తగ్గించాలని టెస్లా అడిగినా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. టెస్లా ఇండియాకు వచ్చి ఇక్కడే కార్‌లు తయారు చేస్తేనే డీల్‌కి ఒప్పుకుంటామని తేల్చి చెప్పింది భారత్. దీనిపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.
మార్కెట్ పెంచుకోవడం కోసం..
ఇప్పటికే కొన్ని అమెరికన్ కంపెనీలు అమెరికా దాటి తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇక చైనా, యూఎస్ మధ్య ఉన్న విభేదాలతో మార్కెట్ కూడా దెబ్బ తింటోంది. అందుకే....కేవలం అమెరికాకే పరిమితం కాకుండా విదేశాల్లోనూ మార్కెట్‌ని ఎస్లాబ్లిష్ చేసుకోవాలని చూస్తోంది టెస్లా. ఇప్పటికే యాపిల్ (Apple)సహా ఆ కంపెనీ సప్లైయర్స్ ఇండియాలో యూనిట్స్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఏడాది టెస్లా, భారత్ మధ్య చర్చలు కాస్త పాజిటివ్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో టెస్లా అధికారులు భారత ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. సప్లై చైన్ ఎక్స్‌పాన్షన్‌పై ఆరా తీశారు. ఇటీవల ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లగా అక్కడ టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మోదీకి పెద్ద ఫ్యాన్‌ని అంటూ మస్క్ ట్వీట్ కూడా చేశారు. అప్పటి నుంచి టెస్లా ఇండియాకు వచ్చేస్తుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారమే నిజమైతే త్వరలోనే ఇండియా రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్‌లు చక్కర్లు కొడతాయి. అయితే...ఇదంత సింపుల్‌గా జరుగుతుందా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మస్క్ మామ ఎప్పుడు మనసు మార్చుకుంటారో అర్థం కాదు. భారత్ పెట్టిన డిమాండ్‌ల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గినా మళ్లీ కథంతా మొదటికే వస్తుంది.
Also Read: చైనా లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి, తిరిగి చెల్లించలేక యువకుడి ఆత్మహత్య