Disaster Funds: రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద 22 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ రూ.7,532 కోట్లను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.493.60 కోట్లు, తెలంగాణకు రూ.188.80 కోట్లు విడుదల చేశారు. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1420.80 కోట్లు అత్యల్పంగా గోవాకు రూ.4.80 కోట్లు విడుదల చేశారు. సాధారణంగా గతేడాది నిధుల వినియోగ ధ్రువ పత్రాలను రాష్ట్రాలు అందజేస్తేనే ఎస్డీఆప్ఎఫ్ నిధులను విడుదల చేస్తారు. కానీ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. వరదల కారణంగా పలు రాష్ట్రాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.