టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా కరీంనగర్‌కు చెందిన మద్దెల శ్రీనివాస్‌, ఆయన కూతురు సాహితిని సిట్‌ అధికారులు బుధవారం 12వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్‌ జీ ఈశ్వరయ్య వారిద్దరికీ జులై 26 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖరరెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది.


బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసుకున్న మూడో పిటిషన్‌ను 4వ అదనపు సెషన్స్‌ కోర్టు ఇంచార్జి జడ్జి భూపతి డిస్మిస్‌ చేశారు. మరో నిందితుడైన కళాశాల ప్రిన్సిపాల్‌ సయ్యద్‌ మహబూబ్‌ బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా జడ్జి కొట్టివేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో కళాశాల డైరెక్టర్‌ రోకొండ్ల వేంకటేశ్వర్లు, బసవవేణి శివకుమార్‌, బిర్రు నాగరాజును 5 రోజులపాటు సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీచేశారు.


మరో ఆరుగులు అనుమానితులు అదుపులోకి..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్‌ తాజాగా మరో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వీరికి మాజీ ఏఈ పోల రమేశ్‌తో సంబంధమున్నట్టు వెలుగులోకి రావడమే ఇందుకు కారణం. ఏఈఈ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ నిర్వహించిన రమేశ్‌.. ఆ తరువాత ఏఈ పరీక్ష పత్రాన్ని పలువురికి విక్రయించాడు. దీంతో రమేశ్‌ నుంచి ఆ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినవారు, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినవారితోపాటు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినవారు, ఆర్ధిక సహకారం అందించినవారి కోసం జల్లెడ పడుతున్న సిట్‌.. తాజాగా ఈ ఆరుగురిని అదుపులోకి తీసుకుంది.


ALSO READ:


సీజీఎల్‌ఈ-2023 'టైర్-1' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీజీఎల్‌ 'టైర్‌-1' పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial