Chennai Govt Hospital Fire Accident: తమిళనాడులో మరో ప్రమాదం జరిగింది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం.
3 ఫైరింజన్లతో మంటలు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో చిక్కుకున్న 50 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. రోగులు అందర్ని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలోని పాత బ్లాక్‌లో మంటలు చెలరేగాయని, కొత్త బ్లాక్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.
రథోత్సవంలో
తమిళనాడు తంజావురులో ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగిలి 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యుధాఘాతం అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదైంది.
అగ్నిప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Covid Update: కరోనా పరిస్థితులపై కీలక సమీక్ష- సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
Also Read: Lord Shiva: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది