Sonia Health : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ కారణంగా పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 12వ తేదీన ఆస్పత్రిలో చేరిన ఆమెకు ముక్కు నుంచి రక్తం కారుతూండటంతో అత్యవసరంగా చికిత్స ప్రారంభించారు. ఇప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఫంగల్ ఇన్పెక్షన్ ఉన్నట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం సోనియా గాంధీ సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సోనియా గాంధీకి కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో రాజకీయ కార్యకలాపాలకూ దూరంగా ఉన్నారు. గతంలో విదేశాల్లో చికిత్స తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం కారణంగా మరోసారి ఆమె అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. చురుకుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ వల్ల అనారోగ్యం ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరారు.
ఒకప్పుడు టీవీ యాంకర్, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ సెల్లర్, అప్ఘనిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి నిదర్శనం!
మరో వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ... ఆమెకు గతంలో నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలను కొంత కాలంగా చేస్తున్నారు. ఈ క్రమంలో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ విచారణ జరుపుతోంది ఈడీ. మూడు రోజుల పాటు విచారణకు రాహుల్ హాజరయ్యారు. తల్లి ఆస్పత్రిలో ఉన్నందున ఆమె బాగోగులు చూసుకునేందుకు సోమవారం వరకూ గడువు కావాలని అడిగారు. ఆ మేరకు అనుమతించడంతో సోనియా చికిత్స పొందుతున్న ఆస్పత్రికి రాహుల్ వెళ్లారు.
అమ్మ ఆస్పత్రిలో ఉంది విచారణకు రాలేదు - ఈడీకి తెలిపిన రాహుల్
సోనియా గాంధీ, రాహుల్‌లకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సోనియా ఆస్పత్రిలో చేరడంతో ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సింప్టమ్స్ ఎక్కువగా ఉండటం ఇన్ఫెక్షన్, ముక్కులో రక్త స్రావం కూడా ఉండటంతో సోనియా త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పూజలు చేస్తున్నారు.