పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఆర్మీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు బీభత్సం సృష్టించటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లను కట్టడి చేేసే ప్రయత్నం చేసినా అది సాధ్య పడలేదు ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. పైగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితులు చేయి దాటిపోవటం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే యువకులుఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తోపలాటలో పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే ఒకరు మృతి చెందారు. ఇప్పటికే పోలీసులు రైల్వే స్టేషన్ చుట్టూ మోహరించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బోగీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
కర్రలతో, రాళ్లతో రైళ్లను కొడుతూ, బోయి గూడ ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ వద్ద ఉన్న ఇంజన్ కి కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. ఈస్ట్ కోస్ట్ రైలుకు 5 బోగిల కు నిప్పు పెట్టగా.. పోలీసులు, రైల్వే కార్మికులు కలిసి బోగీల్లో మంటాలార్పుతున్నారు. రైల్వే పోలీసులకు సహాయం చేసేందుకు రెగ్యూలర్ పోలీసులు సికింద్రాబాద్‌కు చేరుకుంటున్నట్లు సమాచారం. అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నిరసనలు
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వాహించాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. రైల్వేస్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది. నిజానికి ముందుగానే ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నిరసనలు ఆపి రైల్వేస్టేషన్‌ను ఖాళీ చేయకపోతే కాల్పులు చేస్తామని హెచ్చరించారు. అయినా మాట వినకపోవటం వల్ల చివరకు కాల్పులు జరిపారు.
ఎన్ఎస్‌యూఐ సంఘాలు అల్లర్లకు కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అగ్నిపథ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం వివరణ ఇస్తున్నా, దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఘటనతో ఈ నిరసనలు కొత్త మలుపు తీసుకున్నాయి.