సికింద్రాబాద్‌కు ఈ రూట్‌లో సేఫ్‌గా వెళ్లండి 


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో పోలీసులు భారీగా మోహరించారు. స్టేషన్‌కు వెళ్లే దారులన్నీ దిగ్బంధించారు. ఫలితంగా ఆ వైపు వెళ్లాలనుకునే వారికి కష్టాలు తప్పేలా లేవు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ టచ్‌కాకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవటానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోక తప్పేలా లేదు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, కేపీహెచ్‌బీ సుదూర ప్రాంతాల నుంచి ఉప్పల్‌కు చేరుకోవాలనుకునే వాళ్లు సికింద్రాబాద్‌ మీదుగా కాకుండా వేరే దారులలో వెళ్లాల్సి ఉంటుంది. ఆ దారులేంటో ఓ సారి చూద్దాం. 
 
హైటెక్ సిటీ నుంచి ఉప్పల్‌ వెళ్లాలనుకునే వాళ్లు ముందుగా పంజాగుట్ట చేరుకోవచ్చు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌ రూట్‌లో వెళ్లాలి. నేరుగా లిబర్టీ చేరుకుని, అక్కడి నుంచి అంబర్‌పేట్ మీదుగా రామాంతపూర్‌ వెళ్లాలి. రామాంతపూర్ నుంచి ఉప్పల్‌కు సులువుగా వెళ్లిపోవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. ట్యాంక్‌బండ్ దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా ఆర్‌టీసీ ఎక్స్‌ రోడ్‌కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి అంబర్‌పేట్ మీదుగా ఉప్పల్ వెళ్లిపోవచ్చు. ఒక వేళ ట్యాంక్‌బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కకుండా ఉంటే నేరుగా లిబర్టీ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఉప్పల్‌కి వెళ్లొచ్చు. ఈ రూట్‌లో కాస్త ట్రాఫిక్ అధికంగా ఉన్నప్పటికీ సికింద్రాబాద్‌ను టచ్ చేయకుండా ఇంటికి వెళ్లిపోవచ్చు. 


ఇక కేపీహెచ్‌బీ నుంచి ఉప్పల్‌కు వెళ్లాలనుకునే వారికీ ఆల్టర్‌నేట్ రూట్స్ ఉన్నాయి. కేపీహెచ్‌బీ నుంచి కూకట్‌పల్లి, వై జంక్షన్ మీదుగా బాలానగర్ వెళ్లాలి. అక్కడి నుంచి మిలిటరీ ఏరియా మీదుగా తాడ్‌బండ్‌ వెళ్లాలి. అక్కడి నుంచి ఈసీఐఎల్ మీదుగా చెంగిచెర్ల వెళ్లాలి. అక్కడి నుంచి ఉప్పల్‌కు సులువుగానే వెళ్లిపోవచ్చు.