Karnataka High Court: 


ట్విటర్ పిటిషన్‌పై విచారణ..


కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ ఒపీనియన్స్‌ని మార్చడంలో సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తోందని స్పష్టం చేసింది. ఏ ప్లాట్‌ఫామ్‌ అయినా పొలిటికల్‌గా చాలా మందిని ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తోందని వెల్లడించింది. అందుకే ప్రభుత్వాలు వాటిపై కఠినంగానే వ్యవహరించాలని, బలమైన చట్టాలు తయారు చేయాలని సూచించింది. ఇది వీలైనంత త్వరగా చేయకపోతే... ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వ్యాఖ్యానించింది. జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. ట్విటర్‌ తీరుపై చాలా రోజులుగా మండి పడుతోంది కేంద్ర ప్రభుత్వం. విద్వేషాలను పెంచడంతో పాటు అవాస్తవాలను ప్రచారం చేయడంలో ట్విటర్‌ సాయపడుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఐటీ చట్టంలో మార్పులు చేర్పులు చేసి ట్విటర్‌పై ఆంక్షలు విధించింది. కొన్ని ట్వీట్‌లను, అకౌంట్‌లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది ట్విటర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ పిటిషన్‌ని కొట్టేసింది. 


"సోషల్ మీడియా ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిస్తోంది. అందరి పొలిటికల్ ఒపీనియన్స్‌ని మార్చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఓటర్లను మిస్‌లీడ్ చేస్తోంది. తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోడానికి అంతా సోషల్ మీడియాపైనే ఆధార పడుతున్నారు. ఇదే ప్రజాస్వామ్యానికి మేలు చేస్తున్నప్పటికీ...అదే సమయంలో కీడు కూడా చేస్తోంది. అందుకే...దీనిని మానిటర్ చేయడం చాలా కీలకం. అవసరమైతే కంట్రోల్ కూడా చేయాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం"


- కర్ణాటక హైకోర్టు


కేంద్ర ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న ట్విటర్ పిటిషన్‌ని కొట్టేసిన కోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. "మా వాదనను కోర్టు సమర్థించింది. ట్విటర్ ఇక్కడి రూల్స్‌ని పాటించాల్సిందే" అని స్పష్టం చేశారు. గతేడాది ఐటీ యాక్ట్‌లో సంస్కరణలు చేసిన కేంద్రం...Section 69A ప్రకారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 2021 నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలు ప్రచారం చేసిన అకౌంట్‌లు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ని ఆదేశించింది. దాదాపు 39 లిస్ట్‌ చేసి వాటిని బ్లాక్ చేయాలని తేల్చి చెప్పింది. దీనిపై ట్విటర్ అసహనం వ్యక్తం చేసింది. ఇది తమ రూల్స్‌కి వ్యతిరేకమని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేసింది. న్యాయపోరాటానికి సిద్ధమైంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం తమపై ఆంక్షలు విధించడాన్ని ట్విటర్ వ్యతిరేకించింది.గతేడాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. "బ్లాక్ చేయాలని చెబుతున్నారు సరే..వాటికి కారణాలూ చెప్పాలిగా" అని ట్విటర్ వాదించింది. అయితే...కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రూల్స్‌కి కట్టుబడి ఉండకుండా ట్విటర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కోర్టుకి వివరించింది.ఈ ఆర్డర్ పాస్ చేసే ముందు ట్విటర్ ప్రతినిధులతో మాట్లాడమని వెల్లడించింది. 


Also Read: యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై కాంగ్రెస్ కీలక భేటీ, యాక్షన్ ప్లాన్ ఫైనల్ చేయనున్న సోనియా