MP Highcourt:మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ల వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది. యుక్తవయస్సులో ఉన్న అబ్బాయిలను నేరస్థులుగా పరిగణించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల వ్యక్తిపై FIR ను రద్దు చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బాలికపై అత్యాచారం కేసులో మూడేళ్లుగా జైలులో ఉన్న 20 ఏళ్ల బాలుడికి ఊరట కల్పిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న మైనర్లను జైల్లో పెట్టడం అన్యాయమంది.
మైనర్ల వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ 2012లో తీసుకున్న నిర్ణయం సమాజంలోని సహజ స్వరూపానికి విఘాతం కలిగించిందని జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి టీనేజ్ అబ్బాయి, అమ్మాయి చాలా త్వరగా ఇలాంటి విషయాలు నేర్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీనేజ్ పిల్లలు ఒకరినొకరు ఆకర్షితులవుతారు. క్రమంగా సమ్మతితో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారున్నారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇలాంటి కేసుల్లో అంగీకారంతో సంబంధాలు పెట్టుకున్న బాలురను అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొంది. వయసు రీత్యా టీనేజర్లైన వారు అంగీకారంతో శృంగారంలో పాల్గొంటున్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడి గత మూడేళ్లుగా జైల్లో ఉన్న బాల నేరస్థుడిపై నమోదైన కేసును ధర్మాసనం కొట్టివేసింది. అనంతరం బాలుడిని విడుదల చేయాలని ఆదేశించింది. 2020 జూలైలో పోక్సో చట్టం కింద అరెస్టైన నిందితుడకి ఇంతవరకు బెయిల్ రాలేదు.
ఆ ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పింది?
ప్రాసిక్యూషన్ ప్రకారం, ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ అని, అయితే ఈ మొత్తం కేసును విచారించిన ఈ కోర్టు, ఆ వయస్సులో ఉన్న మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, వారు వారి మంచి, చెడు నిర్ణయాలను సొంతగా తీసుకోగలరని నిర్ధారణకు వచ్చారని జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ తన తీర్పులో రాశారు. కాబట్టి, దీనికి వేరేవాళ్లను నిందించలేం అన్నారు.