మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్‌ నుంచి పుణె వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 25 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు.  ప్రమాదంలో  పాతికమంది చనిపోగా మరో పది మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. బస్సు పూర్తిగా గాలి బూడిద అయింది. 










 


రాజస్థాన్‌లో కూడా ప్రమాదం 


రాజస్థాన్‌లోని బికనీర్‌లో కూడా బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ను ఓ టూవీలర్‌ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. టూవీలర్ నడుపుతున్న వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. బస్‌లో ఉన్న వారిని వెంట వెంటనే సురక్షితంగా దించారు. ఈ ప్రయాణికులను రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రమాదంలో బస్‌ పూర్తిగా గాలి బుడదైపోయింది. కాలిపోతూనే బస్‌ ముందుకు వెళ్లిపోవడం మనకు కనిపిస్తుంది.