దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ తొలి విడత సీట్ల కేటాయింపు మొదలైంది. తొలి రౌండ్ కేటాయింపు ప్రక్రియ జులై 4 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఐఐటీ గువాహటి పేర్కొంది.


ఇక రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఆరు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు తెలుసుకోవచ్చు.


సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే జులై 26 నుంచి 31 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.


JoSAA Counselling ఇలా..


♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు


♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు


♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు


♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు


♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:


♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న


♦ 2వ రౌండ్‌: జులై 6న


♦ 3వ రౌండ్‌: జులై 12న


♦ 4వ రౌండ్‌: జులై 16న


♦ 5వ రౌండ్‌: జులై 21న


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న


జోసా 2023-కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..




ALSO READ:


త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు, ముఖ్య నోటిసు విడుదల చేసిన ఎంసీసీ!
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial