Congress on UCC:
కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం..
యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై కేంద్రం స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. వర్షాకాలం సమావేశాల్లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అంతకు ముందు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై డిస్కస్ చేయనుంది. అయితే...అటు కాంగ్రెస్ మాత్రం ఈ కోడ్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోనియా గాంధీ కీలక నేతలతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ మరో కీలక భేటీ నిర్వహించనున్నారు సోనియా గాంధీ. పార్లమెంట్‌లో ప్రస్తావించిన అంశాలపై చర్చించడంతో పాటు యునిఫామ్ సివిల్ కోడ్ బిల్ ప్రవేశపెడితే ఏం చేయాలన్నదీ డిస్కస్ చేయనున్నారు కాంగ్రెస్ నేతలు. జులై 3వ తేదీన ప్రత్యేకంగా యూసీసీ గురించే చర్చించేందుకు మరోసారి సమావేశం అవనున్నారు. ఆ రోజు ఏమేం చర్చించాలి..? యూసీసీపై ఎలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి..? అనే అంశాలపై వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగడం వల్ల UCCని ఆ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందని అర్థమవుతోంది. ఇది కేవలం మైనార్టీలను అణిచివేసేందుకే అని ప్రచారం చేసి ఎంతో కొంత బీజేపీకి డ్యామేజ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు విపక్షాలూ వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు యూసీసీ అందుకు కారణం కానుంది.
పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్..!
యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్‌ని ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. జులైలో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...Uniform Civil Code Bill ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనుంది. దీనిపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటుంది. ఆ తరవాతే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ప్రకటన చేసినప్పటి నుంచే విపక్షాలు మండి పడుతున్నాయి. ఇక పార్లమెంట్‌లో బిల్‌ని తీసుకొస్తే ఇంకెంత వాగ్వాదం జరుగుతుందో చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌తో సహా పలు ముస్లిం సంఘాలు UCCని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే...లా కమిషన్,కేంద్ర న్యాయ శాఖకు చెందిన ప్రతినిధులతో జులై 3వ తేదీన పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు ఇప్పటికే వాళ్లకు కబురు పంపింది. జులై మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇవి జరగనున్నాయి. చాలా రోజులుగా దీనిపై వాగ్వాదం నడుస్తున్నప్పటికీ...ప్రధాని మోదీ ప్రకటనతో అది మరింత ముదిరింది. ముఖ్యంగా ముస్లిం సంఘాలు దీనిపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నాయి. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బట్టే అది అర్థమవుతోంది. కాంగ్రెస్ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది.
Also Read: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం- కదిలే బస్‌లో మంటలు, 25 మంది సజీవదహనం