Adheenams handover the Sengol to the PM Modi: దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న అంశం సెంగోల్. వినడానికి కొత్త పదంగా ఉన్నప్పటికీ అధికార మార్పిడి సమయంలో రాజదండం ఇస్తారని ఇటీవల బీజేపీ నేతలు తెలిపారు. కాగా, మరికొన్ని గంటల్లో భారత పార్లమెంటు నూతన భవనం ప్రారంభం కానున్న సందర్భంగా అధికార చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న చోళ రాజదండం సెంగోల్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. తమిళనాడు కు చెందిన 20 శైవ పీఠాల అధిపతులు ప్రధాన మంత్రి నివాసానికి చేరుకుని ఆయనకు ఆశీర్వాదం అందించారు.
భారత పార్లమెంటు నూతన భవనం ప్రారంభం కానున్నందును అధికార దర్పంగా భావించే సెంగోల్ ను శాస్త్రోక్తంగా ప్రధాని చేతులకు అధీనమ్స్ అందించారు. నంది విగ్రహం ఉండే ఈ పొడవాటి రాజదండాన్ని చోళ రాజుల కాలంలో అథారిటీకి చిహ్నంగా భావించేవారు. 1947 తర్వాత రాజాజీ సలహాతో సెంగోల్ ను రూపొందించి జవహర్ లాల్ నెహ్రూకు లార్డ్ మౌంట్ బాటన్ అందించారని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయం వెల్లడించారు. కొత్త పార్లమెంట్ భవనంలో Sengolని పొందుపరచనున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఏంటీ సెంగోల్ అనే చర్చ జరుగుతోంది. దేశ స్వాతంత్య్రోద్యమంతో ముడిపడి ఉన్న అంశమిది.
సెంగోల్ కు అంత చరిత్ర ఉందా!
సెంగోల్ ఓ తమిళ పదం. దీన్ని ఇంగ్లీష్‌లో Scepter (రాజదండం) అంటారు. అప్పట్లో రాజులు సార్వభౌమత్వానికి చిహ్నంగా ఇది ధరించేవాళ్లు. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత అధికారాలను బదిలీ చేస్తూ లార్డ్ మౌంట్ బాటన్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ఇది అందజేశారు. భారత్‌కి పూర్తి అధికారాలు ఇస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అధికారాలను ఎలా బదిలీ చేయాలో అర్థం కాలేదు. నెహ్రూని మౌంట్ బాటన్ ఇదే ప్రశ్న అడిగారు. అప్పటి చివరి వైస్రాయ్ సీ. రాజగోపాలచారీ అలియాస్ రాజాజీని సలహా అడిగారు నెహ్రూ. తీవ్రంగా ఆలోచించి ఓ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. చోళుల చరిత్రను ప్రస్తావించారు. చోళుల కాలంలో ఓ రాజు నుంచి మరో రాజుకి అధికారులు బదిలీ చేసే సమయంలో ఓ రాజదండాన్ని (Sengol) గుర్తుగా ఇచ్చేవారని నెహ్రూకి రాజాజీ వివరించారు. మౌంట్ బాటన్ కు విషయం చెప్పగా.. తయారు చేయించిన సెంగోల్‌ని నెహ్రూ స్వీకరించడంతో అలా అధికారాలు బదిలీ అయ్యాయి.
Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?