Satyendar Jain: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంతో పాటు సహచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు చేసింది. ఈ దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి. మొత్తం 2.82 కోట్ల రూపాయల నగదు, 1.8 కిలోల 133 బంగారు నాణేలు, బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు.






హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో మే 30న సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో సత్యేంద్ర జైన్‌, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. 


ఇదీ కేసు


సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన కొన్ని కంపెనీలపై ఈడీ ఇటీవల విచారణ జరుపుతోంది.  కొన్ని చోట్ల సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలో కొన్నిసోదాలు నిర్వహించినప్పుడు అక్కడి కంపెనీ సాయంతో మనీ లాండరింగ్ నిర్వహించినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సోదాలు జరిపినప్పుడే దాదాపుగా రూ. నాలుగు కోట్ల 81  లక్షల సొమ్ము సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన సంస్థల్లోకి అక్రమంగా వచ్చినట్లుగా గుర్తించారు. ఈ సొమ్మును అప్పుడే అటాచ్ చేశారు. ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేశారు.


ఈ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగించింది కోర్టు. జూన్ 9 వరకూ కస్టడీకి అప్పగిస్తున్నట్లు రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆదేశించింది.


అయితే సత్యేందర్ జైన్‌కు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, భాజపా.. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని తమ పార్టీ నేతలను వేధిస్తోందని ఆరోపిస్తోంది ఆమ్‌ఆద్మీ. 


Also Read: Indian Railways: 'తూచ్, అలాంటిదేం లేదు'- లగేజీ పాలసీపై రైల్వేశాఖ కీలక ప్రకటన


Also Read: CM Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ