ABP  WhatsApp

CM Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ

ABP Desam Updated at: 07 Jun 2022 04:39 PM (IST)
Edited By: Murali Krishna

CM Mamata Banerjee: బంగాల్‌ను విభజించాలని వస్తున్న డిమాండ్లపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.

నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ

NEXT PREV

CM Mamata Banerjee: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగాల్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ భాజపా నేతలు చేస్తోన్న డిమాండ్లపై ఫైర్ అయ్యారు. తన రక్తం చిందించైనా బంగాల్‌ను ముక్కలు కాకుండా కాపాడతానని దీదీ అన్నారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.



2024 సార్వత్రిక ఎన్నికల కోసం భాజపా వేర్పాటు రాజకీయాలు చేస్తోంది. ఉత్తర బంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యంగా జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో భాజపా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. కొన్నిసార్లు గూర్ఖాలాండ్‌, ఇంకొన్నిసార్లు నార్త్‌ బంగాల్‌ అంటూ రెచ్చగొడుతోంది. నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే కానీ బంగాల్‌ను మాత్రం విభజన కానివ్వను.                                                                   - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం


ఇటీవల 


బంగాల్ ప్రభుత్వం ఇటీవల మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే గవర్నర్- ముఖ్యమంత్రి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్న వేళ బంగాల్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మేరకు బంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రకటించారు.



రాష్ట్ర ప్రభుతం నడిపే యూనివర్సిటీలకు గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రిని ఛాన్స్‌లర్‌గా ఉంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదనను త్వరలోనే బిల్లుగా అసెంబ్లీ ముందుకు తీసుకొస్తాం.                                                                                      "
- బ్రత్య బసు, బంగాల్ విద్యాశాఖ మంత్రి



Also Read: Mumbai Police Summons Nupur Sharma: నుపుర్ శర్మకు ముంబయి పోలీసుల సమన్లు- వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం


Also Read: Monkeypox Cases: మంకీపాక్స్ వైరస్‌పై WHO హెచ్చరిక- 27 దేశాల్లో 780 కేసులు


 

Published at: 07 Jun 2022 04:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.