Mumbai Police Summons Nupur Sharma: భాజపా నుంచి సస్పెండైన నేత నుపుర్ శర్మకు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని ముంబయి పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల పార్టీ నుంచి సస్పెండైన భాజపా నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భారత్‌పై పలు ముస్లిం దేశాలు విమర్శలు చేస్తున్నాయి.
సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, కువైట్ వంటి దేశాలు ఈ వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. అయితే తాజాగా కువైట్ వ్యాపార సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారతీయ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి.
కువైట్ సిటీలోని అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ర్యాకుల నుంచి ఇండియన్ టీ, ఇతర ఉత్పత్తులను తొలగించారు. అలాగే కువైట్ నగరం వెలుపల ఉన్న ఒక సూపర్ మార్కెట్‌లోని ర్యాకుల్లో ఉన్న రైస్, ఇతర భారతీయ ఉత్పత్తులపై ప్లాస్టిక్ కవర్లు కప్పారు. 'భారతీయ ఉత్పత్తులను తొలగించాం' అని అక్కడ నోటీస్ ఉంచారు.
ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కువైటీ ముస్లిం ప్రజలు ఏ మాత్రం సహించరని ఆ స్టోర్ సీఈవో నాసర్ అల్-ముతైరి తెలిపారు. తమ సంస్థకు చెందిన అన్ని స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేసినట్లు చెప్పారు.
Also Read: Monkeypox Cases: మంకీపాక్స్ వైరస్‌పై WHO హెచ్చరిక- 27 దేశాల్లో 780 కేసులు
Also Read: Leopard Attacks Pet Dog: నక్కినక్కి కుక్కపై దాడి చేసిన చిరుత- వీడియో వైరల్