Leopard Attacks Pet Dog: ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి నక్కినక్కి దాడి చేసింది. మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది.
నాసిక్ జిల్లాలోని ముంగ్‌సరి గ్రామంలోని ఓ ఇంటి ప్రహరీ గోడపై ఈ నెల 5వ తేదీన పెంపుడు కుక్క కూర్చుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ ఇంటి వైపు చిరుత పులి వచ్చింది. గోడపై కూర్చున్న కుక్క చిరుతను చూసి కిందకు దూకింది. దీంతో చిరుత కూడా కొంచెం అయోమయానికి గురైంది.
అయితే కుక్క మళ్లీ ప్రహరీ గోడను దూకి బయటకు వెళ్లింది. దీంతో క్షణాల్లోనే కుక్కను చిరుత అటాక్ చేసింది. కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించినా చిరుత నోటికి చిక్కింది. కుక్కపై దాడి చేసిన చిరుత దాన్ని పట్టుకుని అక్కడి నుంచి జారుకుంది. ఈ దృశ్యాలన్ని ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల
హరియాణాలోని పానిపట్ సమీపంలో గత నెలలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు.
Also Read: Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,714 కరోనా కేసులు- ఏడుగురు మృతి
Also Read: Prophet Muhammad Row: భారత్‌కు కువైట్ షాక్- మన దేశ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం!