Prophet Muhammad Row: ఇటీవల పార్టీ నుంచి సస్పెండైన భాజపా నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భారత్‌పై పలు ముస్లిం దేశాలు విమర్శలు చేస్తున్నాయి.


సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతార్‌, కువైట్‌ వంటి దేశాలు ఈ వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. అయితే తాజాగా కువైట్ వ్యాపార సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారతీయ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి.


నిషేధం






కువైట్‌ సిటీలోని అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ర్యాకుల నుంచి ఇండియన్‌ టీ, ఇతర ఉత్పత్తులను తొలగించారు. అలాగే కువైట్‌ నగరం వెలుపల ఉన్న ఒక సూపర్‌ మార్కెట్‌లోని ర్యాకుల్లో ఉన్న రైస్‌, ఇతర భారతీయ ఉత్పత్తులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు. 'భారతీయ ఉత్పత్తులను తొలగించాం' అని అక్కడ నోటీస్‌ ఉంచారు.


ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కువైటీ ముస్లిం ప్రజలు ఏ మాత్రం సహించరని ఆ స్టోర్‌ సీఈవో నాసర్‌ అల్-ముతైరి తెలిపారు. తమ సంస్థకు చెందిన అన్ని స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేసినట్లు చెప్పారు.


ఖతార్ నోటీసులు


మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఇందుకు భారత ప్రభుత్వం బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌కు అధికారిక నోట్ అందించింది. ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు నోట్ లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై మిట్టల్ స్పందిస్తూ ఈ ట్వీట్లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని తెలిపారు. అవి వ్యక్తిగత అభిప్రాయాలు అని తెలిపారు. 


Also Read: Indian currency: కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ క్లారిటీ- ఆ వార్తలు నిజం కాదట


Also Read: Russia–Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు- భారత్‌ ఎంత నష్టపోయిందో తెలుసా?