Russia–Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి జూన్ 3తో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఇప్పటివరకు రష్యా సాధించిందేంటి? ఉక్రెయిన్ పోగొట్టుకున్నది ఎంత? అనే విషయాలు చూద్దాం. అయితే ఈ యుద్ధంతో నష్టపోతుంది కేవలం ఈ రెండు దేశాలే కాదు.. భారత్‌తో పాటు అనేక దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఉంది.

 

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- 100 రోజులు 

ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటివరకు తమ 20 శాతం భూభాగాన్ని కోల్పోయింది. 

2022 ఫిబ్రవరి 24 – యుద్ధం మొదలు

2022 జూన్ 3– యుద్ధానికి 100 రోజులు

భారత్‌పై ప్రభావం

ద్రవ్యోల్బణం పెరుగుదల (CPI)

2022 జనవరి – 6.01%

2022 ఫిబ్రవరి– 6.07% 

2022 మార్చి– 6.95% 

2022 ఏప్రిల్– 7.79%

Source: MoSPI

భారీగా పెరిగిన ఆహార ధరలు

ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల

2022 జనవరి- 5.43%

2022 ఫిబ్రవరి- 5.85%

2022 మార్చి- 7.68%

2022 ఏప్రిల్- 8.38%

Source: MoSPI

క్షీణిస్తోన్న విదేశీ మారక నిల్వలు

2022 ఫిబ్రవరి 18  - 632 బిలియన్ డాలర్లు (రూ. 47.25 లక్షల కోట్లు)

2022 మే 20  – 598 బిలియన్ డాలర్లు (రూ. 46.38 లక్షల కోట్లు)

క్షీణత శాతం– 5.38% 

Source: RBI

పడిపోయిన రూపాయి విలువ

2022 ఫిబ్రవరి 23 – ఒక డాలరు విలువ- రూ. 74.62

2022 జూన్ 23 - ఒక డాలరు విలువ- రూ. 77.56

సెన్సెక్స్ ఢమాల్ 

2022 ఫిబ్రవరి 23న బీఎస్‌ఈ సెన్సెక్స్ – 57,232 పాయింట్లు

2022 జూన్3న బీఎస్‌ఈ సెన్సెక్స్ – 56,271 పాయింట్లు

జీడీపీ అంచనా తగ్గింది – 2021-22 ఆర్థిక సంవత్సరం (రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం)

వివిధ అంచనాలు

GDP శాతం (2021-22 ఆర్థిక సంవత్సరం)

మొదటి అంచనా (2022 జనవరి)

9.2 శాతం

రెండో అంచనా (2022 ఫిబ్రవరి)

8.9 శాతం

వాస్తవిక అంచనా (2022 మే)

8.7 శాతం

నిరుద్యోగం

2022 జూన్ – 7.2 శాతం

గోధుమల ఎగుమతి

2022 మే - రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన భారత్.. గోధుమల ఎగుమతిని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాత ఇందులో కొన్ని సడలింపులు చేసింది.

భారత ఆటో రంగం

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ తక్కువ కాంపోనెంట్స్ సరఫరాను భరించాల్సి వచ్చింది.

సెమీకండక్టర్ చిప్ కొరత, సరఫరా-గొలుసు సంక్షోభం, డిమాండ్ ఉన్న కార్ల కోసం సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన పరిస్థితులను రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీసుకువచ్చింది. 

ప్రపంచంపై ప్రభావం 

ఐరాస లెక్కల ప్రకారం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రోజుకు కనీసం ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

చిన్నారుల మృతి- కనీసం 243 మంది చిన్నారులు రష్యా జరిపిన దాడుల కారణంగా మృతి చెందారు. 446 మంది గాయపడ్డారు. 

పౌరుల మృతి ( ఐరాస అంచనా) - ఈ యుద్ధం కారణంగా కనీసం 4,149 పౌరులు మృతి చెందారు. 4,945 మంది గాయపడ్డారు. అయితే వాస్తవిక లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని ఐరాస తెలిపింది. 

వలసలు- ఉక్రెయిన్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు తమ ఇంటిని వదిలి బయటకు వలస వెళ్లిపోయారు. ఇప్పటివరకు 77 లక్షల మంది పరిస్థితి ఇలా ఉన్నట్లు ఐరాస తెలిపింది. 

68 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లినట్లు ఐరాస పేర్కొంది. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 

ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ 8.5% క్షీణించనున్నట్లు అంతర్జాతీయ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులు తగ్గిపోవడమే ఇందుకు కారణం.

ఉక్రెయిన్- ఉక్రెయిన్‌ సైన్యం, మానవతా సాయం కోసం రూ. 64,405 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇది ఉక్రెయిన్ వార్షిక బడ్జెట్‌లో 8వ వంతు. 

మౌలిక సదుపాయాల నష్టం- ఇప్పటివరకు ఉక్రెయిన్ దాదాపు రూ.7.76 లక్షల కోట్లు మౌలిక సదుపాయలపై నష్టపోయినట్లు ద కీవ్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నివేదించింది. 

రష్యా - పరికరాలపై ఇప్పటివరకు రష్యా రూ.లక్ష కోట్లు కోల్పోయినట్లు ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. 

రష్యాపై ఆంక్షలు 

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 46 దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. 2022 ఫిబ్రవరి నుంచి రష్యాపై 7,782 ఆంక్షలు విధించాయి వివిధ దేశాలు. దీంతో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొన్న దేశంగా రష్యా రికార్డులకెక్కింది.