Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 3,714 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2513 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,31,85,049‬
  • మొత్తం మరణాలు: 5,24,708
  • యాక్టివ్​ కేసులు: 26,976
  • మొత్తం రికవరీలు: 4,26,33,365

వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 13,96,169 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. మరో 3,07,716 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ఫోర్త్ వేవ్ అంచనాలు

ఫోర్త్ వేవ్ ఎప్పుడైనా రావచ్చు.., అప్రమత్తంగా ఉండండి అంటూ ఐదు రాష్ట్రాలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ముంబయిలో కరోనా ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ కూడా కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేయనుంది. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించింది. 

Also Read: Prophet Muhammad Row: భారత్‌కు కువైట్ షాక్- మన దేశ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం!

Also Read: Indian currency: కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ క్లారిటీ- ఆ వార్తలు నిజం కాదట