Indian Railways: లగేజీ పాలసీను మార్చినట్లు వస్తోన్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైలు ప్రయాణం సమయంలో లగేజీపై సోషల్ మీడియా సహా డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ప్రస్తుత పాలసీని తాము మార్చలేదని రాబోయే 10 ఏళ్లలో కూడా మార్చబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఇవే వార్తలు
రైలులో ప్రయాణించే సమయంలో ఎక్కువ లగేజ్ ఉంటే దానికి కూడా ముందే బుకింగ్ చేసుకోవాలని ఇటీవల వార్తలు వచ్చాయి. ముందు బుక్ చేసుకోకపోతే సాధారణ రేట్ల కన్నా ఆరు రెట్లు ఎక్కువ పెనాల్టీ కట్టాల్సి వస్తుందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. లగేజ్ పరిమితి నిబంధనలను ఇక కచ్చితంగా అమలు చేస్తామని రైల్వే శాఖ పేర్కొన్నట్లు ఆ వార్తల సారాంశం. లగేజీపై రైల్వేశాఖ చేసిన ఓ ట్వీట్ ఆధారంగా ఈ వార్తలు వచ్చాయి.
Also Read: CM Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా కానీ బంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ