Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

Delhi New Chief Minister:బీజేపీ శాసనసభా పక్ష నాయకురాలిగా రేఖ గుప్తా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె బుధవారం (ఫిబ్రవరి 20) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేఖ గుప్తా షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే.

Continues below advertisement

Delhi New Chief Minister: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా jరేఖాగుప్తా పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. ఆయన రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రామ్‌లీలా మైదానంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Continues below advertisement

భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పరిశీలకులు సమావేశమై ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. అనంతరం బిజెపి శాసనసభా పక్ష సమావేశం కూడా జరిగింది. అధిష్ఠానం ఖరారు చేసిన వ్యక్తిని శాసనసభా పక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకున్న తర్వాత రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. 

చివరి వరకు పోటీలో ఉంది వీళ్లే 

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. వడపోస్తూ వచ్చిన బీజేపీ హైకమాండ్‌ చివరకు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. వారిలో ఒకరిని ఖరారు చేసింది. ఈ పోటీలో చివరి వరకు పోటీ పడింది షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైన రేఖ గుప్తా. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన ఎమ్మెల్యే పర్వేష్ వర్మ,  రాజౌరి గార్డెన్ నుంచి గెలిచిన మంజీందర్ సింగ్ సిర్సా, రోహిణి నుంచి ఎలక్టైనా ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కూడా చివరి వరకు పోటీలో నిలిచారు. 

ఇద్దరు డీసీఎంలు !

26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కూర్చుంటున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుంది. ఇంత ఘన విజయం సాధించిన నేతలు సీఎం కుర్చీ కోసం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అందుకే ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ప్రభుత్వంలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు సీఎం కోసం జరిగిన పోటీ ఇప్పుడు డీసీఎం కోసం జరగనుంది. 

రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారోత్సవం 

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20 (గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో జరగనుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని ఓడించి 26 సంవత్సరాల తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. 

హాజరుకానున్న చంద్రబాబు  

గురువారం మధ్యాహ్నం రాంలీలా మైదానంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఇతర అతిథులు హాజరుకానున్నారు. దాదాపు 50,000 మంది ఈ వేడుకకు వస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola