Race with horse: పతంజలి సంస్థ అధినేత, యోగా గురు బాబా రాందేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆసక్తి లేకపోయినా సరే యోగా గురించి ఆయన వీడియోల్ని అందరూ చూసి ఉంటారు. అలాగే ఆయన కంపెనీ పతంజలి ఉత్పత్తులు.. వాటి వెనుక ఉన్న వివాదాలు కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫిట్ నెస్ గురించి మాత్రం ఎవరూ కామెంట్ చేయలేరు. జీరో ఫ్యాట్ బాడీతో ఆయన చేసే యోగాను ఎవరూ చేయలేరు. అప్పుడప్పుడు కుస్తీ పోటీల్లో కనిపిస్తూంటారు. ఇప్పుడు రన్నింగ్ రేసుల్లోనూ పాల్గొని వైరల్ అయ్యారు. మనుషులతో అయితే రన్నింగ్ రేస్ పెద్దగా హాట్ టాపిక్ అయ్యేది కాదేమో కానీ ఆయన గుర్రంతో పోటీపడ్డారు.
గుర్రంతో జరిగిన పోటీలో ఆయన విజయం సాధించారు. యోగా పవర్ ను ప్రచారం చేయడానికి ఆయన ఈ పోటీ పెట్టుకోలేదు. తమ సంస్థ తయారు చేసిన ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడానికి ఈ పోటీ పెట్టుకున్నారు. అందుకే నెటిజన్లు ఆయన .. మార్కెటింగ్ లో మస్క్ కన్నా ముందుంటారని సెటైర్లు వేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
తమ కంపెనీ రిలీజ్ చేసిన క్యాప్సుల్ తింటే గుర్రం అంత బలం వస్తుందని ఆయన చెప్పదల్చుకున్నారు. అందుకే గుర్రంతో పోటీ పెట్టుకున్నారు.
అయితే పతంజలి తయారు చేసే ఉత్పత్తుల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని.. మెడికల్ సర్టిఫికేషన్ ఉండదని పలువు నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఉత్పత్తిని వాడితే వచ్చ అనారోగ్య సమస్యల గురించి ఏం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గతంలో పతంజలి తరపున విడుద ల చేసిన చాలా ఉత్పత్తులు వివాదాస్పదమయ్యాయి.