మొత్తం 6 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 రాజ్యసభ స్థానాల భర్తీకి ఈ నెల 31న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
ఏప్రిల్ 2న అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ పొందనున్నారు. అలాగే పంజాబ్ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. పదవీ విరమణ పొందే వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. దీంతో మార్చి 31నే ఎన్నికలు జరిపి, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేయనున్నారు.
ఏ రాష్ట్రంలో
13 రాజ్యసభ స్థానాల్లో పంజాబ్ నుంచి ఐదు, కేరళ నుంచి మూడు, అసోం నుంచి రెండు, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర నుంచి ఒక్కొక్క స్థానం చొప్పున భర్తీ చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సంబంధిత ప్రధాన కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31న పోలింగ్ జరగనుంది.
ఆప్
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ఇన్నిం గ్స్ మొదలు పెట్టాడు. ఇటీవలే తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఈ నెల 31న జరుగనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నిక కోసం ఆమ్ ఆద్మీ ఐదుగురు సభ్యులను ప్రకటించింది. ఇందులో భజ్జీతో పాటు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, సంజీవ్ అరోరా, అశోక్ కుమార్‌ను ఆప్ ఎంపిక చేసింది. సోమవారం పంజాబ్ విధానసభలో హర్భజన్ నామినేషన్ దాఖలు చేశాడు.
Also Read: COVID-19 Lockdown in China: అదే వైరస్, అదే భయం, అదే వణుకు- చైనాలో మళ్లీ లాక్‌డౌన్