చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఆ దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో సోమవారం నుంచి లాక్‌డౌన్ విధించారు. ఈ నగరంలో దాదాపు 2.6 కోట్ల మంది ఉన్నారు.
కరోనా వైరస్ వచ్చిన రెండేళ్లలో ఈ నగరంలో ఇదే అతిపెద్ద లాక్‌డౌన్‌గా అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తప్పనిసరి అయితేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి లేదని ఆదేశించారు.
ఇవన్నీ బంద్
షాంఘైలో ఎక్కువగా వ్యాపారం జరిగే డిస్నీ థీమ్ పార్క్‌ను ఇప్పటికే మూసివేశారు. అత్యవసరాలు మినహా మిగతా కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలులో ఉంది.
గడిచిన నెలలో చైనాలో 56 వేల కేసులు నమోదయ్యాయి. . చైనాలో టీకా పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని చైనా జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో
భారత్‌లో రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కొత్తగా 1,259 మందికి వైరస్ సోకింది. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,705 మంది వైరస్‌ను జయించారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మరో 25,92,407 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,53,90,499కు పెరిగింది.
Also Read: Worlds Expensive Camel : ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఒంటె - ధర తెలిస్తే షాక్ తింటారు!