EPFO E-Nomination: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్ చేసుకోలేదా.. అయితే అందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation) తన ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది.  ఈ నామినేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేయాలంది. ఈపీఎఫ్ ఖాతాదారులు నామినీని నిర్ణీత గడువులోగా యాడ్ చేయకపోతే రిటైర్మెంట్‌కు సంబంధించిన ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను మీరు పొందలేరని హెచ్చరించింది. కరోనా సమయంలో ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అడ్వాన్స్ కింద రూ.1 లక్ష రూపాయాలను సైతం అందించారు. అంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రూల్స్ సరిగ్గా పాటిస్తే చాలా ప్రయోజనాలు మీ సొంతం.


ఈ నామినేషన్ తప్పనిసరి.. 
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత భాగస్వామిని లేక తల్లిదండ్రులు, తమ పిల్లలు ఇలా ఎవరిరైనా ఖాతాకు నామినీని యాడ్ చేసుకోవాలని పేర్కొంది. ఆన్‌లైన్ PF, పెన్షన్ మరియు బీమా ద్వారా వారిని రక్షించడానికి నామినేషన్లను నమోదు చేసుకోవడం చాలా కీలకమని పేర్కొంది. సబ్‌స్క్రైబర్స్‌కు ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఇ-నామినేషన్‌ (EPFO E-Nomination)ను పూర్తి చేసుకున్న వారికి కుటుంబసభ్యులకు ప్రయోజనాలు అందుతాయని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ పూర్తయిన తర్వాత, జరగరాని ప్రమాదం జరిగితే నామినీకి బీమా మరియు పెన్షన్ లాంటి ప్రయోజనాలను పొందగలుగుతారని ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.






ఈ ప్రయోజనాలు అందుకోండి..
ఈ-నామినేషన్ పూర్తి చేసుకున్న వారు ఎంప్లాయ్​ డిపాజిట్​ లింక్డ్​ ఇన్సూరెన్స్ స్కీమ్​ (EDLI​) ద్వారా రూ.7 లక్షల బీమాకు అర్హులు అవుతారు. ప్రమాదవశాత్తూ ఈపీఎఫ్ ఖాతాదారులు చనిపోయినట్లయితే వారు పేర్కొన్న నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రమాద భీమా నగదును ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. కరోనా లాంటి కష్ట సమయాలలో సైతం ఈపీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ నగదు తీసుకునే ప్రయోజనాన్ని కేంద్ర కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ కల్పించింది.
Also Read: EPF Interest Rate: కేంద్రం ఉన్నపళంగా పీఎఫ్ మీద వడ్డీ ఎందుకు తగ్గించింది..?


Also Read: EPFO E-Nomination: పీఎఫ్‌ డబ్బు కావాలా? ఈ-నామినేషన్‌ చేయండి మరి!