Presidential Poll:  రాష్ట్రపతి ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలుపెడుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షపార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ సుప్రీం నేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె చర్చించినట్లు సమాచారం.


ఉమ్మడి అభ్యర్థి


రాష్ట్రపతి ఎన్నికలపై విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు సోనియా అప్పగించారు. ఈ అంశంపై విపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వారు సూచించే అభ్యర్థుల పేర్లను ఖర్గే తెలుసుకోనున్నారు.


ఎన్‌డీఏ అభ్యర్థి


మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి విషయమై ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని సీఎంలు, ఎన్డీఏతర పార్టీల ముఖ్యమంత్రులతోనూ భాజపా చర్చలు జరిపిందగి. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ , వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ ప్రధానితో కూడా భేటీ అయి..  రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించారు.  2017లో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును జూన్‌ 17న ప్రకటించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత జూలై 17న ఎన్నికలు జరిగాయి. అదే నెల 20న ఫలితాలను ప్రకటించారు. ఈ సారి రెండు రోజుల ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. జూలై 18న పోలింగ్.. 21న కౌంటింగ్ జరుగుతుంది. సీనియర్‌ నేత, బీజేపీలో అందరికీ సన్నిహితుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు కూడా ఢిల్లీలో ప్రముఖంగా వినిపిస్తోంది. 


రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ నెల 15న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 18న పోలింగ్ జరగనుంది. జులై 21న కౌంటింగ్ నిర్వహించనున్నారు.


2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.


కీలక తేదీలు



  • ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15

  • నామినేషన్లకు చివరి రోజు: జూన్ 29

  • నామినేషన్ల పరిశీలన: జూన్ 30

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 2

  • పోలింగ్: జులై 18

  • కౌంటింగ్, ఫలితాలు: జులై 21

  • ప్రమాణస్వీకారం: జులై 25


Also Read: Karnataka News: రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కుమార్తె- పోలీసులతో గొడవ, వీడియో వైరల్!


Also Read: Indian American Sopen Shah: బైడెన్ నిర్ణయం- మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు