Indian American Sopen Shah: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఇండో అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. భారత సంతతికి చెందిన సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా  బైడెన్ నామినేట్ చేశారు.






ఆ రికార్డ్


జూన్ 6న శ్వేతసౌధం ప్రకటించిన ఆరుగురు యూఎస్ అటార్నీల జాబితాలో సోపెన్‌ షా కూడా ఉన్నారు. ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోపెన్‌ నియామకం ఆమోదం పొందితే మాడిసన్‌లోని యూఎస్ అటార్నీ కార్యాలయానికి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఘనత దక్కించుకుంటారు. 


ప్రొఫైల్


సోపెన్ షా కెంటుకీలో స్థిరపడ్డారు. 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్‌ కోయి ఎల్‌ఎల్‌పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు. సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్‌ సివిల్‌, క్రిమినల్‌ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు.


అంతా మనోళ్లే


బైడెన్ యంత్రాంగంలో 20 మందికి పైగా భారత సంతతి అమెరికన్లు ఉన్నారు. వీరిలో 13 మంది మహిళలే కావడం విశేషం. వీరిలో 17 మంది వైట్‌హౌస్‌లో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే అయినా, అగ్రరాజ్యం వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ వర్గానికి బైడెన్‌ తన బృందంలో పెద్దపీట వేశారు. అలాగే, తన టీమ్‌లో వివిధ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పించి అమెరికా చరిత్రలోనే అత్యంత వైవిధ్యం కలిగిన పాలకవర్గాన్ని సమకూర్చుకున్నారు.


Also Read: Covid Update: దేశంలో భారీగా కరోనా కేసులు- కొత్తగా 7,584 మందికి వైరస్


Also Read: Who Is NDA President Candidate: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ? ఈ సారైనా దక్షిణాదికి చాన్సుందా ?