Bridge Tragedy :  అప్పుడే ఆ వంతెన ప్రారంభించారు. సున్నితంగా వాడుకుంటే సరిపోయేది. కానీ తాము కట్టించాం కాబట్టి.. తమను మాత్రం భరించలేదా అనుకుంటూ అందరూ గుంపులు గుంపులుగా వెళ్లారు. చివరికి కేమయింది.. ఏమవుతుంది.. ఆ వంతెన విరిగి కిందపడింది. ఈ ఘటన మెక్సికోలో జరిగింది.  





న్యూయార్క్‌ కోర్టులో బొద్దింకల దండయాత్ర- కేసు వాయిదా వేసి అంతా పరార్!


రాజధాని మెక్సికో సిటీకి సమీపంలోని అత్యంత జనరద్దీ ఉన్న క్యూర్నావాకా   ఆ నగరంలో సహజ, ప్రకృతి అందాల ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక నది వెంట నడక కోసం ఒక వంతెనను ఇటీవల నిర్మించారు. మధ్యలో నీటి ప్రవాహాల మీదుగా వేలాడేటట్లుగా చెక్క, మెటల్‌ తో వంతెనను ఏర్పాటు చేశారు. మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ దీనిని ప్రారంభించారు. అనంతరం తన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, మీడియా సిబ్బందితో కలిసి దానిపై నడిచారు.


టొమోటో కెచప్ దొరకడం కష్టమే! డెన్మార్క్‌ పరిశోధకుల ఆసక్తికరమైన అంశాలు


ఆ వంతెనపై నడవడం మాత్రమే కాదు..గంతులేశారు. చివరికి  కాలువ మీదుగా ఉన్న వేలాడే వంతెన భాగం తెగిపోయింది. దీంతో మేయర్‌, ఆయన భార్యతో సహా 20 మందికిగా వ్యక్తులు పదడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న కొండ రాళ్లు, కాలువ సమీపంలో పడ్డారు. నలుగురు సిటీ కౌన్సిల్‌ సభ్యులు, ఇద్దరు అధికారులు, ఒక స్థానిక రిపోర్టర్‌ సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. కాళ్లు, చేతులు, నడుము విరిగిన ఎనిమిది మందిని స్ట్రెచర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు.  


ఓ వైపు యుద్ధం, మరోవైపు వినోదం- కీవ్‌ థియేటర్‌లో షోలు హౌస్‌ఫుల్!
  
వంతెన ప్రారంభానికి ముందే కొందరు ఆ వేలాడే చోట జంప్‌ చేసి ఉంటారని, అలాగే సామర్థ్యానికి మించి ఒకేసారి ఎక్కువ మంది దానిపై నడవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని మేయర్‌ తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కారణం ఏదైనా ఆ వంతెన ప్రారంభించిన రోజే పనికి రాకుండా పోయింది. దాని వల్ల పలువురు తీవ్రంగా గాయపడాల్సి వచ్చింది.