Covid Update: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 7,584 మంది వైరస్​ బారిన పడ్డారు. 24 మంది మృతి చెందారు. తాజాగా 3,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.08 శాతం ఉన్నాయి.







  • మొత్తం కరోనా కేసులు: 4,31,97,866

  • మొత్తం మరణాలు: 5,24,747

  • యాక్టివ్​ కేసులు: 36,267

  • మొత్తం రికవరీలు: 4,26,44,092


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 15,31,510 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,76,42,992 చేరింది. మరో 3,35,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, కర్ణాటకల్లోనే ఎక్కువ కేసులు ఉండటంతో గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫెక్లన్లను తగ్గించడమే లక్ష్యంగా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ లేఖ రాశారు.


వైరస్‌ను ముందుగా గుర్తించి వ్యాప్తిని నిరోధించడంలో టెస్టింగ్‌లదే కీలక పాత్ర అని ఆయన అన్నారు. అందువల్ల విస్తృత స్థాయిలో టెస్టులు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-వ్యాక్సిన్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం అనే ఐదంచెల వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్‌ కట్టడికి ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.


Also Read: Who Is NDA President Candidate: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ? ఈ సారైనా దక్షిణాదికి చాన్సుందా ?


Also Read: Majils In RJD : మజ్లిస్ మళ్లీ పాతబస్తీకే పరిమితమా ? ఓవైసీ ఆశలు గల్లంతయినట్లే !