Majils In RJD :  మజ్లిస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఇతర పార్టీలో చేరిపోవాలని నిర్ణయించారు. అయితే అది హైదరాబాద్‌లో కాదు.. బీహార్‌లో.  రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు.  ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు.. మజ్లిస్‌ను ఆర్జేడీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిహార్‌లోనూ తమ విజయంపై మజ్లిస్‌ ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. యూపీలో ఇటీవల 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన మజ్లిస్‌ పార్టీ ఒక్క చోటా గెలవలేకపోయింది.


సోలోగా సోలోగమీ మ్యారేజ్- వరుడు తప్ప ఇక్కడ అన్నీ ఉంటాయ్!


భవిష్యత్‌పై భయంతో ఆర్జేడీలో చేరుతున్న మజ్లిస్ ఎమ్మెల్యేలు


బిహార్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో ఆర్జేడీ విజయావకాశాలను మజ్లిస్‌ పార్టీ దెబ్బకొట్టింది. కాగా, ఎమ్మెల్యేల ఫిరాయింపు వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సమాలోచనలు జరిపారు. బిహార్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారనుండటంతో భవిష్యత్తు కార్యాచరణ గురించి పార్టీ నాయకులతో చర్చించారు. ఆర్జేడీలో విలీనం కావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు మాత్రం ఓవైసీలతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. 


కొత్త కార్మిక చట్టాలు - 3 రోజుల వీకాఫ్‌! పెరగనున్న లీవ్స్‌, బేసిక్‌ పే, పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌!


దేశవ్యాప్తంగా మజ్లిస్‌ను విస్తరించాలనుకుంటున్న ఓవైసీ


మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి అసదుద్దీన్ కొంత కాలంగా శ్రమిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీని గెలిపించడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా  ప్రతీ రాష్ట్రంలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. ముస్లిం జనాభా మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో కొన్ని సీట్లను సాధిస్తోంది. అయితే అన్ని చోట్లా చొచ్చుకుపోలేకపోయింది. మహారాష్ట్రలోనూ కాస్త ప్రభావం చూపింది. బీహార్‌లో ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేల్ని గెలిపించుకోగలిగారు. 


రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల- జులై 18న పోలింగ్


అన్ని రాష్ట్రాల్లోనూ మజ్లిస్‌కు నేతల గుడ్ బై 


కానీ ఇక ఏ ఇతర రాష్ట్రంలోనూ మజ్లిస్ ఉనికి కనిపించలేదు. దీంతో ముస్లింలు కూడా ఆ పార్టీని ఓన్ చేసుకోవడంలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల బెంగాల్‌లోనూ మజ్లిస్ పోటీ చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ పార్టీ నేతలందరూ వరుసగా తృణమూల్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆర్జేడీలో చేరుతున్నారు. మొత్తంగా దేశం మొత్తం మజ్లిస్‌ను విస్తరించాలనుకున్న అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు మాత్రం ఫెయిలవుతున్నాయి.