Pradhan Mantri Sangrahalay:   దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా భార‌త ప్ర‌ధాన మంత్రుల మ్యూజియాన్ని న‌రేంద్ర మోదీ   ప్రారంభించారు. ప్ర‌ధాని మోదీ మొద‌టి టిక్కెట్ కొనుగోలు చేశారు. మ్యూజియాన్ని సంద‌ర్శించారు. ఈ మ్యూజియంలో 14 మంది ప్ర‌ధానుల చ‌రిత్ర వుంటుంది.  మొద‌టి ప్రధాని నెహ్రూ జీవితం, ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌కు సంబంధించి ఓ డిస్‌ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా నెహ్రూకు వ‌చ్చిన బ‌హుమ‌తుల‌ను కూడా ఈ మ్యూజియంలో వుంచారు. దేశ ప్ర‌ధానులు ,వారి జీవితాలు, దేశం కోసం వారు ప‌డ్డ శ్ర‌మ‌… ఇలా మొత్తం కూడా ఇందులో పొందుప‌రిచారు.


భారత్‌లో ఆ ఉల్లంఘనలు పెరుగుతున్నాయన్న అమెరికా మంత్రి - మన విదేశాంగమంత్రి దీటైన కౌంటర్!


ఈ మ్యూజియంలో రెండు బ్లాకులు వుంటాయి. అందులో మొద‌టిది తీన్మూర్తి భ‌వ‌న్‌. రెండో బ్లాక్ పూర్తిగా కొత్త బ్లాక్‌. 15 వేల 600 చ‌ద‌ర‌పు మీట‌ర్ల కంటే ఎక్కువే ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న భార‌త్ ను ప్రేర‌ణ‌గా తీసుకొని, ఈ భ‌వ‌న నిర్మాణం చేపట్టారు.  ఇంత‌టి మ్యూజియం నిర్మించే స‌మ‌యంలో ఒక్క చెట్టును కూడా తొలగించకుండా డిజైన్‌ను రూపొందించారు.   మ్యూజియానికి సంబంధించిన స‌మాచారం గానీ, ఫొటోలు గానీ, ఇత‌రత్ర సమాచార్ని కూడా జాగ్ర‌త్త‌గా సేక‌రించారు. ప్ర‌సార భార‌తి, దూర‌ద‌ర్శ‌న్‌, ఫిల్మ్ విభాగాలు, పార్లమెంట్ టీవీ, ర‌క్ష‌ణ శాఖ‌, భార‌త్ మీడియాతో పాటు విదేశీ మీడియా సంస్థ‌లు, విదేశీయ స‌మాచార ఏజెన్సీలతో పాటు వివిధ లైబ్ర‌రీల నుంచి వీటిని సేక‌రించారు.






కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా రద్దు - కేంద్రం కీలక నిర్ణయం


మన్మోహన్​ సింగ్​ వరకు 14 మంది జీవిత విశేషాలు, వారు చేసిన సేవలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరును ప్రధానుల మ్యూజియం పొందుపర్చారు.  మాజీ ప్రధానుల నాయకత్వ లక్షణాలు, ముందుచూపు, ఘనతలను.. ప్రస్తుత యువతరానికి తెలిపేలా చేయడమే దీని ఉద్దేశం. సిద్ధాంతాలకు అతీతంగా ప్రధానుల సేవలకు గౌరవం ఇవ్వాలన్న మోదీ సంకల్పం మేరకు మ్యూజియంను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఆలోచన చేశారు. ఇందులో మొత్తం నలభై మూడు గ్యాలరీస్‌ను ఏర్పాటు చేశారు.