మేకిన్ ఇండియా అనే కార్యక్రమం చేపట్టి దిగుమతలు పూర్తిగా తగ్గించుకుని ఇండియాకు అవసరమైన వస్తువుల్ని ఇండియాలోనే ఉత్పత్తి చేయాలనే ఆలోచనను ప్రధాని మోదీ ఎప్పుడో అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అందులో ఎంత వరకు సక్సెస్ అయ్యామో స్పష్టత లేదు కానీ దాని వల్ల చాలా లాభాలుంటాయని ప్రధాని మోదీ చెబుతున్నారు. తాజాగా మరోసారి అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల ఆంజనేయుడి విగ్రహాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. అందులో యువత.. నిరుద్యోగితపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ - అందరూ అర్హులే ! ఆ రాష్ట్ర ప్రజలకు పండగే
మన ప్రజలు తయారు చేసిన వస్తువులనే మన ఇళ్లల్లో ఉపయోగిస్తే.. అప్పుడు ఎంత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందో ఊహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ ఉత్పత్తులనే మనం ఎక్కువగా ఇష్టపడొచ్చు. కానీ, ఆ వస్తువుల్లో మన మాతృభూమి పరిమళాలు ఉండవన్నారు. వచ్చే 25 ఏళ్లలో మనం గనుక కేవలం స్థానిక ఉత్పత్తులనే వినియోగిస్తే.. దేశంలో నిరుద్యోగం అనేదే ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచం అంతా ఆత్మనిర్భరత వైపు చూస్తోందని.. బారత్ కూడా అన్ని అంశాల్లోనూ స్వావలంబ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం దేశ ప్రజలందరి సహకారం అవసరమన్నారు. ప్రజలంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశంలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.
నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ - ఒక్క చోటా గెలవలేదు !
మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ముందుకు సాగాలని మోదీ అన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సాధువులు హాజరు కావడంతో వారికీ మోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సాధువులను కోరుకునేది ఒక్కటేనని కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు బోధించండని సూచించారు. దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటారు. కేవలం స్వదేశీ వస్తువులే కొనుగోలు చేస్తే ప్రజలందరికీ ఉపాధి లభిస్తుందని... లెక్కలతో సహా చెబుతూ ఉంటారు. ప్రధాని మోదీ ఇదే విషయాన్ని చెప్పినట్లుగా ఉన్నారు.
సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్‌లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?
అయితే బారత ప్రభుత్వం ఎంత ఆత్మనిర్భరత ప్రచారం చేసినా దిగుమతులు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి . అదే సమయంలో భారత్‌లో తయారీ కూడా ఉద్యమంలా మారుతోంది. కానీ పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా పెరగడం లేదు.