ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే వంటి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఆయన గుజరాత్‌లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు స్ట్రాటజిస్ట్గ్ గా పని చేయడానికి అంగీకరించినట్లుగా కూడా ప్రచారం జరిగుతోంది. ఈ తరుణంలో సోనియాతో  భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం  అవుతోంది. 


మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?
 
 రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,  2024  సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌కు సేవలు అందించేందుకు పీకే సిద్ధంగా ఉన్నట్లుగా తెలు్సోతంది. గుజ‌రాత్‌తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నిక‌ల బ్లూప్రింట్‌పై కూడా  కాంగ్రెస్ ముఖ్య నేతలతో పీకే చర్చిస్తున్నారని చెబుతున్నారు.  2024 సార్వత్రిక ఎన్నిక‌లతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచార‌ బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌కు అప్పగిస్తుందని చెబుతున్నారు.  





గుజరాత్ కాంగ్రెస్‌లో హార్దిక్ కల్లోలం - పార్టీ మారబోవడం లేదన్న పటేల్ నేత !


ప్రశాంత్ కిషోర్‌కు రాజకీయ ఆశలు ఉన్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ కోసం పని చేసిన తర్వాత ... అక్కడ టీఎంసీ విజయం సాధించిన వెంటనే.. తాను ఇక స్ట్రాటజిస్ట్‌గా పని చేయనని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోచేరాలని అనుకున్నారు. పలుమార్లు చర్చలు కూడా జరిపారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ చనిపోవడంతో ఆయన స్థానంలోకి ప్రశాంత్ కిషోర్ వెళ్తారన్న ప్రచారం జరిగింది. 


దేశ ఆర్థిక రాజధానిలో కట్టెల పొయ్యిలే ఆధారం - కారణం ఏమిటంటే ?


అయితే ఇతర కాంగ్రెస్ సీనియర్లు అంగీకరించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం తర్వాత మళ్లీ ఆయన కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై మే 6లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించారు. ఆ లోపే కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీకే శిష్యుడు సునీల్ కనుగోలు అనే స్ట్రాటజిస్ట్‌తో ఒప్పందం చేసుకుంది. కర్ణాటక , తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆయన సేవలు అందిస్తున్నారు . ఈ క్రమంలో పీకేను కూడా స్ట్రాటజిస్ట్‌గా తీసుకునే అవకాశాలు లేవని.. నేరుగా ఆయనను పార్టీలో చేర్చుకుంటారని చెబుతున్నారు.