అక్కడ కులం చూడరు. మతం చూడరు. మూడు వందల కన్నా ఎక్కువ యూనిట్లు కరెంట్ వాడతారా లేదా అన్నది చూడరు . అంతకు మించి అర్హతల పేరుతో లబ్దిదారులను తగ్గించే స్కీమ్ అసలు ఉండదు. పథకానికి అందరూ అర్హులే. ఆ పథకం ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల కరెంట్ ఉచితం. ఎన్నికల హామీగా ఆమ్ ఆద్మీ ఇచ్చింది. అధికారం చేపట్టిన నెలలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అమలు చేయడం ప్రారంభించారు. 


నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ - ఒక్క చోటా గెలవలేదు !


పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులైన సందర్భంగా ప్రజలకు ఆప్‌ సర్కారు శుభవార్త వినిపించింది. జులై 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ.. 92 చోట్ల విజయకేతనాన్ని ఎగురవేసింది. దీంతో మార్చి 16 న భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


సోనియాతో ప్రశాంత్ కిషోర్ భేటీ ! కాంగ్రెస్‌లో చేరుతారా ? వ్యూహకర్తగా సేవలందిస్తారా ?


 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ... రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆమ్‌ ఆద్మీ సర్కారు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఇక, ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్‌స్టెప్‌ రేషన్‌ డెలివరీ పథకాన్ని సిఎం గత నెలలో అమల్లోకి తెచ్చారు.


మహిళల వివాహ వయసు పెంచొద్దు - 95 శాతం మంది అభిప్రాయం ఇదేనా !?


పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఇస్తున్నట్లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఆప్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఏప్రిల్‌ 16 న రాష్ట్ర ప్రజలు మంచి వార్త వినబోతున్నారంటూ ఇటీవల ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ముందుగానే ప్రకటించారు. అన్నట్లుగానే ఉచిత విద్యుత్‌పై నేడు ప్రకటన చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో మాన్‌ ఇటీవల సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయించారు. పంజాబ్‌ విద్యుత్ రంగంలో ఎంతో ముందు ఉంది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి.