ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం క్రైస్తవ మత గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. శనివారం ఆయన వాటికన్ సిటీకి చేరుకున్నారు. ఈ మేరకు పోప్‌ను తాను కలిసినట్లుగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్‌తో చక్కని భేటీ జరిగిందని, ఆయన్ని కలిసి ఎన్నో అంశాల గురించి చర్చించామని ట్వీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు భేటీ సాగినట్లు వివరించారు. అంతేకాక, భారత్‌కు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్లుగా వివరించారు. దీనికి సంబంధించి ఫోటోలను మోదీ ట్వీట్ చేశారు.
Also Read: హిందూ దేవతలపై అభ్యంతరకర పోస్టులు... తొలగించాలని ట్విట్టర్ ను కోరిన దిల్లీ హైకోర్టు
వాటికన్ సిటీలో పోప్‌ను కలిసిన ఐదో భారత ప్రధాని మోదీ కావడం విశేషం. అంతకుముందు మాజీ ప్రధానులుగా ఉన్న నెహ్రూ, ఇందిరా గాంధీ, ఐకే గుజ్రాల్, వాజ్ పేయీ వంటి వారు పోప్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 1955లో జులైలో నెహ్రూ ఇటలీకి వెళ్లినప్పుడు పోప్ పీయూస్‌తో సమావేశం అయ్యారు. 1981లో ఇందిరా గాంధీ, 1997లో ఐకే గుజ్రాల్, 2000 సంవత్సరంలో వాజ్ పేయీ కూడా ఆ సమయాల్లో ఉన్న పోప్‌లను కలిశారు.
Also read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు
ప్రధాని మోదీ ఐదు రోజుల యూరప్ పర్యటన ప్రస్తుతం సాగుతోంది. శుక్రవారం ఇటలీ రాజధాని రోమ్‌కు ఆయన చేరుకున్నారు. ఇవాల్టి నుంచి రెండు రోజులు జీ-20 సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల అధినేతలతో భేటీ అవుతారు. ఇటలీ నుంచి ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ కాప్-26 అనే సదస్సులో మోదీ పాల్గొంటారు.
Also Read: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి
Also read: కూర్చుని - నిల్చునే ఈ టెస్ట్ చెప్పేస్తుంది... వచ్చే అయిదేళ్లలో మీ ఆరోగ్యం గురించి