Parliament Monsoon Session: మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో రగడ, సోమవారం వరకూ లోక్‌సభ వాయిదా

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Ram Manohar Last Updated: 21 Jul 2023 01:01 PM
సోమవారానికి లోక్‌సభ వాయిదా

మణిపూర్‌ హింసపై పార్లమెంట్‌లో గందరోగళం నెలకొంది. ఈ కారణంగా లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. 

మొదలైన లోక్‌సభ

విపక్షాల ఆందోళనల మధ్యే లోక్‌సభ ప్రొసీడింగ్స్‌ మళ్లీ ప్రారంభమయ్యాయి. 

రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్

మణిపూర్‌ అంశంపై చర్చించే విషయంలో విపక్షాలు అంత సీరియస్‌గా లేవని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. 

రెండు సభలు వాయిదా

విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా 2.30 గంటల వరకూ వాయిదా పడింది. 

చర్చకు సిద్ధమే

మణిపూర్ హింసపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంశాఖ మంత్రి దీనికి సమాధానాలు చెబుతారని కేంద్రమంత్రి అర్జున్ రామ్‌పాల్ వెల్లడించారు. 

చర్చకు పట్టు

మణిపూర్‌లోని శాంతి భద్రతలపై కేంద్రం చర్చించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్ చేశారు. 

ప్రధాని మాట్లాడాల్సిందే: ప్రియాంక చతుర్వేది



 





ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మణిపూర్‌ హింసపై మాట్లాడాలని ఉద్దవ్ బాల్ థాక్రే శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. 

 

వాయిదా తీర్మానాలు

మణిపూర్‌ అంశంపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. 

ఉభయ సభలు రేపటికి వాయిదా

విపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ, లోక్‌సభ రేపు (జులై 21) ఉదయం 11 గంటల వరకూ వాయిదా పడ్డాయి. 

చర్చకు సిద్ధమేనంటున్న బీజేపీ

మణిపూర్‌ హింసపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి స్పష్టం చేశారు. కాకపోతే దానికంటూ ఓ ప్రొసీజర్ ఉంటుందని వెల్లడించారు. నిందితులను ఉపేక్షించమని తేల్చి చెప్పారు. 

పియూష్ గోయల్ అసహనం

సభ సజావుగా సాగడం విపక్షాలకు ఇష్టం లేదని, అందుకే అనవసరంగా ఆందోళన చేస్తున్నారని కేంద్రమంత్రి పియూష్ గోయల్ మండి పడ్డారు. మణిపూర్‌పై చర్చకు సిద్ధమే అని చెప్పినా సభను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 





రాజ్యసభ వాయిదా

గందరగోళం కారణంగా రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. 

రాజ్యసభలో గందరగోళం

వాయిదా పడి మొదలైన కాసేపటికే రాజ్యసభలో మళ్లీ గందరగోళం నెలకొంది. మణిపూర్ అల్లర్లపై చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టు పడుతున్నాయి. 

సోనియా ఆరోగ్యంపై మోదీ ఆరా

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 

సభ సజావుగా సాగేందుకు సహకరించండి: ప్రధాని

సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. బాధ్యతాయుతంగా సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 

మణిపూర్‌ చర్చ ఉంటుందన్న రాజ్‌నాథ్

మణిపూర్‌ అల్లర్లపై తప్పకుండా పార్లమెంట్‌లో చర్చ ఉంటుందని, కేంద్ర తరపున అందుకు సమాధానం కూడా చెబుతామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 

ప్రధాని మోదీ అసహనం

మణిపూర్ హింసపై తొలిసారి ప్రధాని మోదీ స్పందించారు. నిందితులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


 





మణిపూర్‌ అల్లర్లపై చర్చ

మణిపూర్‌లోని హింసాత్మక ఘటనలపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. 

రాజ్యసభ కూడా వాయిదా

సిట్టింగ్ ఎంపీ హర్‌ద్వార్ దూబే మృతికి సంతాపంగా రాజ్యసభను కూడా 12 గంటల వరకూ వాయిదా వేశారు. 

లోక్‌సభ వాయిదా

పార్లమెంట్ వర్షాకాలు ప్రారంభమైనా కాసేపటికే లోక్‌సభ వాయిదా పడింది. ఇటీవలే మృతి చెందిన ఎంపీలకు సంతాపం ప్రకటిస్తూ ఇలా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 

Background

Parliament Monsoon Session: 


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చించేందుకు సిద్ధమని కేంద్ర బుధవారం ప్రకటించింది. వర్షాకాల సమావేశాల కోసం వివిధ అంశాలపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సమావేశమైన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాన్‌సూన్ సెషన్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం స్పీకర్ ఆమోదించిన ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో, మణిపూర్ లో జరిగిన హింసాకాండపై చర్చించానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జోషి నొక్కి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, అనుప్రియ పటేల్(అప్నాదళ్), రాంగోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), తంబి దురై(అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం), ఎస్టీ హసన్(ఎస్పీ), కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్‌నాథ్‌ సింగ్, ఏడీ సింగ్(రాష్ట్రీయ జనతా దళ్), ఎన్‌కే ప్రేమ్‌చంద్‌ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) సహా వివిధ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశాల్లో మొత్తం 31 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.  


సోనియా గాంధీ నివాసంలో జరిగిన పార్లమెంటరీ వ్యూహ భేటీలో వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ అంశంపై చర్చ చాలా ముఖ్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ శనివారం మీడియా సమావేశంలోనూ నొక్కి చెప్పారు. మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి మాట్లాడాలని, ప్రధానమంత్రి సమక్షంలో చర్చ జరగాలని జైరామ్ రమేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ లో ఏం జరిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏం చేయనున్నాయో.. ప్రధాని ఎంపీలకు తెలియజేయాలని జైరామ్ రమేష్ అన్నారు.. బ్రేక్ ది సైలెన్స్ అని వ్యాఖ్యానించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.