Junior changed and forgot that he was going to help a fan who was suffering from cancer : క్యాన్సర్ పేషంట్ కి ట్రీట్మెంట్ కి సాయం చేస్తానని జూనియర్ ఎన్టీయార్ మాట తప్పారని కౌశిక్ అనే వీరాభిమాని తల్లి సరస్వతి ఆవేదన వ్యకం చేస్తున్నారు. గతంలో వీడియో కాల్ లో జూనియర్ ఎన్టీయార్ తన బిడ్డతో మాట్లాడి హామీ ఇచ్చారని ఆమె చెబుతువన్నారుు.
క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన తిరుపతి కి చెందిన శ్రీనివాసులు, సరస్వతి కుమారుడు కౌశిక్ (19) తన చివరి కోరిక మేరకు దేవర సినిమా చూసి చనిపోవాలని కోరుకున్నాడు. తన అభిమాని విషయాన్ని తెలుసుకున్న ఆయన వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడారు. థైర్యంగా ట్రీట్మెంట్ తీసుకో నేను కలుస్తాను.. చికిత్స కు కావాల్సిన ఖర్చు గురించి మీరు భయపడకండి అని హామీ ఇచ్చారు. అభిమాన నటుడు ఇచ్చిన హామి మేరకు కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యవంతంగా ఉన్న ఆసుపత్రి నుంచి బయటకు రావడానికి 20 లక్లలు అవసరం. అభిమాని కోరిక మేరకు హామి తీర్చాలని లేదా దాతలు సహాయం చేయాలని కౌశిక్ తల్లి సరస్వతి కోరుతుంది.
తిరుపతిలోని వినాయక సాగర్ వద్ద నివాసం ఉంటున్న సరస్వతి దంపతుల కుమారుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. డిగ్రీ రెండవ సంవత్సరం తిరుపతిలోని ఎమెరాల్డ్స్ కళాశాలలో చదువుతున్నాడు. అకస్మాత్తుగా జ్వరం పీడితుడు అయ్యాడు. నెల పాటు ఎన్నో ఆసుపత్రులు అమ్మ సరస్వతి, నాన్న తిరిగినా సాధారణ జ్వరమనే అని వైద్యులు తెలిపారు. అయితే స్థానిక రుయా ఆసుపత్రిలో ఐదు రోజులపాటు అడ్మిట్ చేశారు. డాక్టర్లు ఐదు రోజుల పరీక్షల అనంతరం ప్రాణాంతక వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. బోన్ మ్యారో టెస్ట్ నిర్వహించాలని సూచనలు చేశారు. స్విమ్స్ లోని ఆంకాలజీకి రెఫర్ చేశారు. ఇంతలోనే అబ్బాయి కా ళ్ళు, చేతులు పనిచేయని స్థితిలో ఉన్నాయి.
అప్పట్లో ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు చెందిన కృష్ణ యాదవ్ తిరుపతి నుండి బెంగుళూరుకు పంపారు. బ్లాడ్ కాన్సర్ తో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను పరామర్శించి కౌశిక్ కోరిక మేరకు ఎన్టీఆర్ తో దాదాపు 10 నిమిషాలు వీడిbbbbbbbbbయో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ , అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించి స్టేట్ కన్వీనర్లు మానిక్యం, బసవలకు తగు సూచనలు చేసిన ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆ తల్లి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.