Odisha train accident: 



సీనియర్ రైల్వే ఇంజనీర్ కామెంట్స్..


ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికే చాలా వాదనలు వినిపించాయి. "కారణమేంటో గుర్తించాం" అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కానీ...అదేమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. ప్రాథమిక విచారణలో "సిగ్నల్ ఫెయిల్యూర్" అని తేలినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడీ వాదననీ కొందరు అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఓ సీనియర్ రైల్వే ఇంజినీర్ కీలక విషయాలు చెప్పారు. "జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌"ని వివరించారు. మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు మాత్రమే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. కానీ...లోకోపైలట్ ఉన్నట్టుండి లూప్‌లైన్‌లోకి వెళ్లాడని అంటున్నారు ఆ అధికారి. డేటాలాగర్‌ని పరిశీలించిన తరవాతే ఓ ధ్రువీకరణకు వచ్చినట్టు తెలిపారు. Datalogger అంటే సిగ్నలింగ్ సిస్టమ్‌ని మానిటర్‌ చేసే మైక్రోప్రాసెసర్ బేస్ట్ సిస్టమ్. సిగ్నలింగ్‌కి సంబంధించిన ప్రతి డిటెయిల్‌ ఇందులో రికార్డ్ అవుతుంది. ఇప్పటికే దీనిపై ఓ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులున్నారు. వీరిలో ముగ్గురు "సిగ్నలింగ్ సిస్టమ్ లోపమే" అని చెబుతున్నారు. ఒకరు మాత్రం "ఈ వాదన కరెక్ట్ కాదు" అని అంటున్నారు. Up Loop Lineకి మాత్రమే సిగ్నల్ వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. 


"సిగ్నలింగ్ సిస్టమ్‌లో రెండు సినారియోలు ఉంటాయి. ఒకటి రివర్స్ కండీషన్, మరోటి నార్మల్ కండీషన్. ఓ ట్రైన్‌ లూప్‌లైన్‌లోకి రావాలంటే రివర్స్‌ కండీషన్‌ పెడతారు. మెయిన్‌ లైన్‌కి వెళ్లాలంటే నార్మల్ సిగ్నల్ ఇస్తారు. కానీ...ఇక్కడ జరిగింది వేరు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి "నార్మల్" సిగ్నల్ ఇచ్చినా లూప్‌లైన్‌లోకి వచ్చింది. లూప్‌లైన్‌లోకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలో నిజం లేదు"


- సీనియర్ ఇంజనీర్, రైల్వే 


కరెంట్ షాక్‌తో మృతి..


ఈ ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ వచ్చే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలను బయటకు తీయగా.. వాటిపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగినట్లు రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు.


Also Read: Odisha Train Accident: నా బిడ్డ చనిపోయాడనుకుని శవాల మధ్యలో పడేశారు, వెక్కివెక్కి ఏడ్చిన ఓ తండ్రి