Nature Flaunting Tricolour: మన జాతీయ జెండా ఎప్పుడూ సగర్వంగా ఎగరాలి.. ప్రగతి పథానా దూసుకెళ్లాలి! మన మువ్వన్నెల జెండాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉంది. దాదాపు 200 ఏళ్లకు పైగా మనల్ని పాలించిన తెల్లదొరలను గడగడలాడించింది ఈ జెండా. వ్యాపారం కోసం అంటూ వచ్చి మనల్ని బానిసలుగా మార్చిన బ్రిటీషర్లను పారిపోయేలా చేసింది ఈ జెండా.


జెండా అంటే దేశం అనే అర్థం. అలాంటి నా దేశ జెండా ఎప్పుడూ సగర్వంగా ఎగరాలి.. ప్రగతి పథానా దూసుకెళ్లాలి! జెండాను చూసి దేశభక్తి ఉప్పొంగేలా సెల్యూట్ చేస్తాం మనం. అలాంటి మన దేశ జెండాను ప్రకృతి దిద్దితే ఎలా ఉంటుంది. అవును ప్రకృతి అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ చిత్రం.


నీరు, నేల, ఆకాశం






రోజంతా భగభగ మండుతూ ఉండే సూరీడు.. ఇక ఈ రోజుకు సెలవంటూ అస్తమయమవుతోన్న వేళ సింధూరం పూసుకున్నాడు. ఎగసిఎగసి పడుతూ సముద్రపు అలల నురగలు శ్వేతవర్ణం దిద్దుకున్నాయి.


ఆ సాగర తీరాన పరుచుకున్న పచ్చ పరదా మన జెండా పద్దదనాన్ని అద్దుకుంది. కలగలిసి ఆకాశం, నీరు, నేల.. మన జాతీయ జెండాను చూపించాయి. ప్రకృతి సమస్తం మువ్వన్నెల జెండాను ప్రతిబింబిస్తోంది కదా! ఈ చిత్రాన్ని 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. దీని కింద నెటిజన్లు.. 'జై హింద్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.










Also Read: Bomb Hurled at RSS Office: RSS కార్యాలయంపై బాంబు దాడి- ఎవరు చేసి ఉంటారు?


Also Read: Sri Lanka Crisis: సైకిల్ ఎక్కిన శ్రీలంక! భారీగా పెరిగిపోయిన డిమాండ్!