Bomb Hurled at RSS Office: కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఈ దాడి చేశారు.
ధ్వంసం
ఈ దాడిలో భవనం కిటికిలు దెబ్బతిన్నాయి. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే సీపీఐ (ఎం) కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్ ఆరోపించింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది.
ఇంతకుముందు
గత నెల 30న రాత్రి ఏకేజీ సెంటర్ వద్ద సీపీఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై కూడా బాంబు దాడి జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు.
ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Sri Lanka Crisis: సైకిల్ ఎక్కిన శ్రీలంక! భారీగా పెరిగిపోయిన డిమాండ్!
Also Read: India’s Oldest Tiger Died: దేశంలోనే అతిపెద్ద రాయల్ బెంగాల్ టైగర్ మృతి- 'మిస్ యూ రాజా'